ఆషాఢ బోనాలకు నేడు అంకురార్పణ | ashada bonalu festivities begin today | Sakshi
Sakshi News home page

ఆషాఢ బోనాలకు నేడు అంకురార్పణ

Jul 16 2026 8:21 AM | Updated on Jul 16 2026 8:21 AM

ashada bonalu festivities begin today

గోల్కొండ/చార్మినార్: ఆషాఢ మాసం బోనాలకు అంకురార్పణ జరగనుంది. ఉత్సవ శోభకు గోల్కొండ కోట ముస్తాబైంది. శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు గురువారం ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు కోటలో రాష్ట్ర గవర్నర్, లంగర్‌హౌస్‌ చౌరస్తా వద్ద రాష్ట్ర మంత్రులు అమ్మవార్లకు పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఉంటాయి.  

కాగా.. వచ్చే నెల 6 వరకు సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు జరగనున్నాయి. ఈ నెల 16న గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం, 19న పెద్దమ్మ తల్లికి, 22న బల్కంపేట ఎల్లమ్మకు, 30న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి, వచ్చే నెల 4న చారి్మనార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 6న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి, 26న విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు బోనాలను సమర్పించనున్నట్లు భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ మల్యాల మధుసూదన్‌ యాదవ్‌ 
తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement