కల్మా చదవాలని విద్యార్థుల డైరీలో రాసిన టీచర్ | Hyderabad Success School Controversy | Sakshi
Sakshi News home page

కల్మా చదవాలని విద్యార్థుల డైరీలో రాసిన టీచర్

Jul 16 2026 1:23 PM | Updated on Jul 16 2026 1:37 PM

Hyderabad Success School Controversy

హైదరాబాద్ : పాతబస్తీ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్కూల్లో పని చేస్తున్న ఓ టీచర్‌ రెండో తరగతి హిందూ విద్యార్థితో ఉర్దూలోని కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్‌వర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది. స్కూల్ డైరీలోనూ అదే విషయాన్ని రాశాడు. గమనించిన బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఈ విషయంపై టీచర్‌ను నిలదీశారు.

విషయం పలు ఇందూ సంఘాలు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. సక్సెస్ స్కూల్‌ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement