ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం | Eleven people have died in a fire at a foster care facility in Algiers | Sakshi
Sakshi News home page

ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

Jul 16 2026 4:13 PM | Updated on Jul 16 2026 4:17 PM

Eleven people have died in a fire at a foster care facility in Algiers

అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ఫోస్టర్ కేర్ హోమ్‌ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ అందించే వ్యవస్థ. 

దేశ పౌర రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో మరో 19 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 3 గంటలకు పైగా మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేశారు.

అధికారులు ఈ అగ్ని ప్రమాదంపై వివరాలు వెల్లడించారు. మరణించినవారి, గాయపడినవారి వయసుల గురించి తమ ప్రకటనలో ప్రస్తావించలేదు. పౌర రక్షణ శాఖ 10 అగ్నిమాపక వాహనాలు, 16 అంబులెన్సులను ఘటన స్థలానికి పంపించింది. అల్జీరియాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి.

వారం వ్యవధిలో దాదాపు 1,000 అగ్నిప్రమాదాలు నమోదైనట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అల్జీరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి సిఫీ ఘ్రియెబ్ గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు అల్జీర్స్‌లోని రెండు ఆసుపత్రులకు వెళ్లారు. అగ్నిప్రమాదం వేళ ఐదుగురు వికలాంగులను సంరక్షణలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement