అమెరికాలో తెలుగు యువకుడి హత్య | Tragedy: Telugu Youth Killed in New York USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు యువకుడి హత్య

Jun 6 2026 9:58 PM | Updated on Jun 7 2026 10:17 AM

Tragedy: Telugu Youth Killed in New York USA

హైదరాబాద్‌: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లో తెలుగు యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.  ఈ ఘటన  శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లి నివాసి అయిన అన్షుల్ కుంచ.. జీవనోపాధి వేటలో భాగంగా పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. 

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ చేసే క్రమంలోనే  ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల బారిన పడ్డ అన్షుల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.   ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement