డల్లాస్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌ రీచ్‌ సమావేశం | YSRCP NRI Outreach Meeting Held In Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌ రీచ్‌ సమావేశం

Jul 27 2026 8:48 AM | Updated on Jul 27 2026 8:48 AM

YSRCP NRI Outreach Meeting Held In Dallas

సాక్షి, అమరావతి: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ప్రముఖ నగరం డల్లాస్‌లో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌ రీచ్‌ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ గ్లోబల్‌ కో–ఆర్డినేటర్‌ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 2019–2024 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి  వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్‌ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు.

 ‘జననన్న కోసం మాట్లాడుదాం.. జగనన్న కోసం రాద్దాం.. జగనన్న కోసం పోస్ట్‌ చేద్దాం.. జగనన్న కోసం కోడ్‌ చేద్దాం (డిజిటల్‌ టూల్స్‌/ యాప్‌లు/టెక్‌ పరిష్కారాలు)..’ అని పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ పోర్టల్‌ (www.ysrcpnriwing.org)ను ప్రారంభించారు. జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. పార్టీ కోసం సేవలందించే ఎన్‌ఆర్‌ఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు పార్టీ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామంటూ వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement