‘తప్పు చేయకపోతే.. లోకేష్‌కు ఎందుకంత భయం’ | YSRCP MLC Parvathareddy Chandrasekhar Reddy Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘తప్పు చేయకపోతే.. లోకేష్‌కు ఎందుకంత భయం’

Jul 26 2026 12:27 PM | Updated on Jul 26 2026 12:42 PM

YSRCP MLC Parvathareddy Chandrasekhar Reddy Fires On Nara Lokesh

సాక్షి, నెల్లూరు జిల్లా: నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఇంతపెద్ద అవినీతి జరిగితే నారా లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయరు? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ కోరితే కనీసం జరిగిన అక్రమాలపై స్పందన లేదని మండిపడ్డారు.

‘‘డీఎస్సీ అక్రమాలపై గత 4 నెలలు నుంచి పోరాటాలు చేస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటివరకు ఒక ఎంక్వైరీ వేయలేదు. నీట్‌ పేపర్‌  లీకేజీకి వ్యతిరేకంగా యువత పెద్ద  ఎత్తున పోరాటం  చేసింది. డీఎస్సీ అవకతవకల వైఎస్సార్‌సీపీ సాక్ష్యాధారాలతో చూపింది. నేటికి ఒక్క అంశంపై పారదర్శకమైన విచారణ కానీ.. స్పందన కానీ లేదు. లోకేష్ ఏ తప్పూ చేయకపోతే.. సీబీఐ ఎంక్వైరీ అంటే ఎందుకు అంత భయం?’’ అంటూ చంద్రశేఖర్‌రెడ్డి నిలదీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement