లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి | Telangana Youth Dies Mysteriously In London | Sakshi
Sakshi News home page

లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Jun 26 2026 1:23 PM | Updated on Jun 26 2026 1:26 PM

Telangana Youth Dies Mysteriously In London

లండన్/కామారెడ్డి: ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజే అతను శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతుడు కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25)గా గుర్తించారు. లీసెస్టర్‌లో ఎమ్మెస్ చదువుతున్న శ్రీనాథ్, ఈనెల 22 రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు తన గదిలో శవమై కనిపించాడు. ఈ హఠాన్మరణంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా, ఘటనపై దర్యాప్తు జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement