రూ.70 కోట్ల లాటరీ.. ఆ అదృష్టవంతుడు భారతీయుడే! | Indian Expat Abu Dhabi Wins Dh30 Million In UAE Lottery Jackpot, Becomes Overnight Millionaire | Sakshi
Sakshi News home page

రూ.70 కోట్ల లాటరీ.. ఆ అదృష్టవంతుడు భారతీయుడే!

Jul 9 2026 12:39 AM | Updated on Jul 9 2026 10:22 AM

Indian Expat Abu Dhabi Wins Dh30 Million UAE Lottery Jackpot

అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు సునీల్ కుమార్ సదాశివన్ (52)  యూఏఈ లాటరీలో ఏకంగా 30 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.70 కోట్లు) గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. జూలై 1న జరిగిన 'లక్కీ డే' డ్రాలో ప్రకటించిన ఏడు విజేత సంఖ్యలను సరిగ్గా సరిపోల్చడంతో ఈ భారీ జాక్‌పాట్ అతని సొంతమైంది. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

విజయం గురించి స్పందించిన సునీల్ కుమార్.. తొలిసారి ఫలితాలు చూసినప్పుడు సంఖ్యలను తప్పుగా చదివానేమో అనిపించిందని, మరోసారి టికెట్‌ను పరిశీలించిన తర్వాతే తాను నిజంగానే గెలిచానని అర్థమైందన్నారు. "మొదట నమ్మలేకపోయాను. మళ్లీ చూసిన తర్వాతే ఇది నిజమని గ్రహించాను" అని ఆయన పేర్కొన్నారు.

యూఏఈ లాటరీలో గత ఐదు వారాల వ్యవధిలో ప్రకటించిన రెండో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ విజేత సునీల్ కుమారే. అంతకుముందు మే నెలలో నేపాల్‌కు చెందిన టయాబ్ ఖాన్ తన స్నేహితులతో కలిసి ఇదే జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అలాగే 2025లో ప్రవాస భారతీయుడు  అనిల్‌కుమార్ బొల్లా 100 మిలియన్ దిర్హామ్‌ల తొలి గ్రాండ్ ప్రైజ్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం యూఏఈ లాటరీ ప్రతి బుధవారం, శనివారం 'లక్కీ డే' డ్రాలను నిర్వహిస్తోంది. ప్రతి డ్రాలో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హామ్‌ల రెండో బహుమతి, అలాగే ముగ్గురు అదృష్టవంతులకు 50 వేల దిర్హామ్‌ల చొప్పున 'లక్కీ ఛాన్స్' నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఈ డ్రాలో పాల్గొనడానికి టికెట్ ధర 50 దిర్హామ్‌లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement