బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడంతే.. రూ.5 కోట్లు జాక్‌పాట్!
సాధారణంగా అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఒకటో తారీఖున అలా జీతం పడగానే మొత్తం ఖర్చయిపోతుంది.. నెలాఖరుకు వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుంది. ఇదీ సగటు జీవుడి బ్యాంక్ ఖాతా చిత్రం. నెల చివర్లో తమ ఆర్థిక దుస్థితిని తెలియజేసేందుకు కొందరు ఖాళీ అయిన తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను స్క్రీన్ షాట్లు తీసి సరదాగా స్టేటస్లు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇలా బ్యాంక్ అకౌంట్‌తోనే జాక్‌పాట్ కొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా?అబుదాబిలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల షాజీర్ వెంగా అనూహ్యంగా రూ.5 కోట్లకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. యూఏఈకి చెందిన షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (Sharjah Islamic Bank) నిర్వహిస్తున్న ‘ఎస్ఐబీ మిలియనీర్’ సేవింగ్స్ రివార్డ్స్ ప్రచారంలో ఆయనకు 20 లక్షల దిర్హమ్లు (సుమారు రూ.5.15 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌గా లభించింది. షాజీర్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతి అతని ఖాతాలో పడటం విశేషం.బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజీర్ ఎస్ఐబీ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించాడు. అనంతరం జూన్ 2026 డ్రాలో అతని పేరు గ్రాండ్ ప్రైజ్‌కు ఎంపికైంది. అదే డ్రాలో యూఏఈకి చెందిన మోజా అల్‌షంసీ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారును గెలుచుకోగా, మరో 40 మంది నగదు బహుమతులు అందుకున్నారు.దీనిపై స్పందించిన షాజీర్.. “ఎస్ఐబీ మిలియనీర్ ప్రచారం గురించి ముందే తెలుసు. ఏదో ఒకరోజు నేను కూడా విజేతగా నిలుస్తానని ఆశించేవాడిని. కానీ ఇంత త్వరగా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఈ 20 లక్షల దిర్హమ్లు నా జీవితాన్నే మార్చేస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారత్‌లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలనే కలను సాకారం చేస్తాయి” అని పేర్కొన్నాడు.కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ 2025లో ‘ఎస్ఐబీ మిలియనీర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లో ప్రతి 10,000 దిర్హమ్ల బ్యాలెన్స్‌కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు, లగ్జరీ వాహనాలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రకారం, రాబోయే డ్రాల్లో కూడా ఒక్కోటి 10 లక్షల దిర్హమ్ల విలువైన రెండు ప్రధాన నగదు బహుమతులు ప్రకటించనున్నారు.Congratulations to the winners of SIB Millionaire Draw!Mr. Shajeer Venga won the Grand Cash Prize of AED 2 Million, and Mrs. Moza Butti won a BMW XM.We also congratulate forty other winners who received valuable cash prizes.Start your journey towards achieving a million… pic.twitter.com/osCjwVraHs— Sharjah Islamic Bank (@shjislamicbank) June 16, 2026