భారతీయుడిని ప్రేమించిన సౌదీ యువతి | Saudi girl's love affair with Indian expat shocks her family | Sakshi
Sakshi News home page

భారతీయుడిని ప్రేమించిన సౌదీ యువతి

May 20 2015 7:14 PM | Updated on Aug 20 2018 7:34 PM

భారతీయుడిని ప్రేమించిన సౌదీ యువతి - Sakshi

భారతీయుడిని ప్రేమించిన సౌదీ యువతి

సౌదీ అరేబియాలో ఓ యువతి భారతీయున్ని ప్రేమించి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది.

రియాద్: సౌదీ అరేబియాలో ఓ యువతి భారతీయున్ని ప్రేమించి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. ఇండియా నుంచి వలసవచ్చిన యువకుడిని తాను ప్రేమించానని, అతడినే పెళ్లాడతానని చెప్పడంతో యువతి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. రియాద్ లో ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న భారతీయుడిని ప్రేమించానని 23 ఏళ్ల యువతి తన తల్లితో చెప్పింది.

ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కూతురిని మర్చిపోయి తమదేశం వదిలి వెళ్లిపోవాలని ప్రేమికుడిని బెదిరించాడు. సౌదీ వదిలి వెళ్లిపోయేందుకు అతడు నిరాకరించాడని స్థానిక పత్రిక వెల్లడించింది. తమ ఆచారాలకు వ్యతిరేకం అయినప్పటికీ ప్రియుడిని పెళ్లాడాలని ఆ యువతి పట్టుదలతో ఉంది. 'ఇదేక్కడి ప్రేమరా బాబూ' అంటూ ఆమె తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement