గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయులలో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పాత్ర ప్రముఖమైందని సౌదీ అరేబియాలోని భారతీయ రాయబారి విపుల్ ప్రశంసించారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయులలో తెలుగు ప్రవాసీయులు ఒక ప్రత్యెక విశిష్ఠత కల్గి ఉన్నారని ఆయన పెర్కోన్నారు. దేశమంటె మట్టికాదోయ్ దేశమంటె మనుషులోయ్ అని తెలుగులో ఉచ్చరిస్తూ దీన్ని సార్థకం చేసిన వారు సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయులని అని ఆయన అన్నారు.
తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్) బుధవారం రియాధ్ నగరంలో నిర్వహించిన తెలుగు దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్ విభాగం కార్యదర్శిగా, దుబాయిలో కాన్సుల్ జనరల్ గా మరియు ఖతర్ లో రాయబారిగా పని చేసిన తాను సౌదీలో చూసిన క్రీయాశీలకమైన తెలుగు సమాజాన్ని మరెచోట చూడ చూడలేదని అన్నారు.
గల్ఫ్ దేశాలన్నింటిలో నివసిస్తున్న భారతీయులందరికి తెలుగు ప్రవాసీయులు ఆదర్శమని రాయబారి వ్యాఖ్యానించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండ సేవా కార్యక్రమాలలో ముందుండడం ద్వార మాతృభూమికు నిజమైన సేవ చేస్తున్నారని విపుల్ అన్నారు. సాటా ప్రతినిధులు రంజీత్ చిత్తలూరి, జానీ బాషా, ముజ్జమ్మీల్ శేఖ్, సుచరిత, చేతన, ఎర్రన్న, యాఖూబ్,నాగరాజు, సత్తిబాబు తదితరులు సాటా కార్యకలాపాలను వివరించారు. సదూర ఎడారి ప్రాంతాలలో నివసిస్తున్న అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు వందల కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఈ కార్యక్రమంలో పాల్గోనడానికి రావడం జరిగింది.


