న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్‌కు అండగా నిలిచారు. ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్’(IMEC)కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఐరాస సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ చెక్‌పాయింట్లు, హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల ద్వారా కాకుండా, పైప్‌లైన్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణాను సురక్షిత ప్రాంతాలకు మార్చడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.దశాబ్ద కాలంగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లను అధిగమించే దశలో మనం ఉన్నాం అని పునరుద్ఘాటించారు.
జీ20 ఒప్పందం ఇదే..
ప్రపంచ చమురు బాండాగారమైన సౌదీ అరేబియా నుంచి భారత్, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా రైలు, నౌకాయాన, ఇంధన, డిజిటల్ రంగాలను అనుసంధానించేలా 2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ఈ కారిడార్ ఒప్పందం కుదిరింది.
వ్యూహాత్మక ప్రత్యామ్నాయం..
ఈ కారిడార్ దక్షిణాసియా, పశ్చిమాసియా, ఐరోపా అంతటా అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ అలాగే ఇరాన్ నియంత్రిత చెక్‌పాయింట్‌లకు ఇది బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా, భారత్-ఐరోపా మధ్య రవాణా సమయాన్ని సగానికంటే ఎక్కువగా తగ్గించగలదని భావిస్తున్నారు.
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు..
ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకి చేశామని, తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ ఒక దేశంగా మనుగడ కొనసాగించే అవకాశాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. గతంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.


