ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బాలీవుడ్ మూవీ హనుమాన్ అంశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు విడుదలై ఎనిమిది వారాలైన ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.
అయితే బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నెల 18న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ హక్కులను టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆయన తప్పుకున్నారని టాక్ వినిపించింది. దీంతో టీజర్ రిలీజ్ కూడా వాయిదా పడింది.
అయితే ఈ మూవీ తెలుగు రిలీజ్‌పై ఎలాంటి టాక్ వినిపించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంతో సస్పెన్స్ నెలకొంది. ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఇక తెలుగులో రిలీజ్ లేనట్టే కనిపిస్తోంది. అదే జరిగితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని కేవలం ఓటీటీలో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా.. శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు.


