'రక్తం ‍అమ్ముకుంటానని అన్నారు'.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్ | Chiranjeevi Comments On 48 Years Of Cinema Career Journey, Blood Bank Controversy, And Message To Fans | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'రక్తం ‍అమ్ముకుంటానంటా.. ఎన్ని కోట్ల పాకెట్స్ కావాలి'

Sep 22 2026 3:54 PM | Updated on Sep 22 2026 4:33 PM

Chiranjeevi comments about His 48 years of Cinema Career Journry

మెగాస్టార్ సినీ ప్రస్థానం మొదలై సరిగ్గా నేటికి 48 ఏళ్లు. ఈ రోజు ఆయన ప్రాణం ఖరీదు మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దశాబ్దాలుగా వెండితెరపై స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాకా మూవీలో నటిస్తున్నారు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన చిరంజీవి.. నాలుగు దశాబ్దాలకు పైగా అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో మెగా యూత్‌ ఫోర్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన చిరు తన జర్నీ గురించి వారితో ప్రస్తావించారు.

మన జీవితంలో సమయం చాలా విలువైనదని మెగాస్టార్ అన్నారు. డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ.. గడిచిపోయిన సమయం తిరిగి రాదన్నారు. మనం ఎలా ఎదగాలో అనుక్షణం ఆలోచించాలని.. మనకున్న సమయాన్ని మరింత చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. అతను ఎలా పైకొచ్చాడు? ఎలాంటి ఆలోచనా విధానం, ఆచరణలు పాటించాడన్నది చూడాలన్నారు. మనం ఎంచుకున్న రంగంలో క్రమశిక్షణ అలవరుచుకుంటే రాణించడం చాలా సులభమని తెలిపారు. నా కెరీర్‌లో ప్రతి క్షణాన్ని వినియోగించకున్నానని.. అవే నాకు పునాదిరాళ్లుగా నిలిచియన్నారు.

ఎన్ని కోట్ల పాకెట్స్ అమ్మాలి?

తాను బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అమ్ముకుంటున్నానని కొందరు అన్నారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అయితే నా పారితోషికంతో పోలిస్తే ఎన్ని కోట్ల పాకెట్స్ అమ్మితే ఆ డబ్బుకు సమానం అవుతుందని అన్నారు. ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడాతారో తెలియదన్నారు. నేను ఎవరి దగ్గర చేయి చాచకుండా బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నానని చిరు వెల్లడించారు. ఇందులో నా శ్రమ కన్నా అభిమానుల సహకారం ఎన్నోరెట్లు ఉందని తెలిపారు. మీ జీవితంలో ఎదురయ్యే అవమానాలను పట్టించుకుంటూ కూర్చొంటే ముందుకు వెళ్లలేరని.. లక్ష్యం దిశగా మన అడుగులు వేయాలని అభిమానులకు సూచించారు.

సమయ పాలన తప్పనిసరి..

చిరంజీవి మాట్లాడుతూ..' ప్రస్తుతం కాకా మూవీలో కదిరి కాళిదాస్‌గా నటిస్తున్నా. రోజూ తెల్లవారుజామున నాలున్నర్రకే నిద్రలేస్తా. ఆ తర్వాత గంట వ్యాయామం చేస్తా. మేకప్‌ వేసుకుని ఉదయం 8 గంటలకు నేరుగా కోకాపేటలోని సెట్స్‌లో ఉంటా. నేను ఉదయం పది గంటలకు సెట్‌కు వచ్చినా నన్ను ఎవరూ అడగరు. కానీ నాకే క్రమశిక్షణ లేకపోతే.. మిగిలిన టీమ్‌కు‌ ఎలా ఉంటుంది. నా డైరెక్టర్స్ అంతా ఉదయం ఏడు గంటలకే ఫుల్‌ టీమ్‌తో రెడీగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడికైనా.. ఇక్కడి కార్మికుడికైనా ఉన్నది 24 గంటలే. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెగా యూత్‌ ఫోర్స్‌ మరింత బలోపేతం కావడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అభిమానులు నా నుంచి ఏమి కోరుకుంటారో అది ఇవ్వడానికి సిద్ధమవుతా. మిమ్మల్ని వీలైనంత వరకూ అలరించడంపైనే దృష్టి పెడతా. మన అనుబంధం ఇలాగే కొనసాగాలి' అని అన్నారు.

అభిమానులు కలిసుండాలి..

మెగాస్టార్ మాట్లాడుతూ..'తాను అదృష్టాన్ని నమ్మనని.. కేవలం నా కష్టాన్నే నమ్ముకుంటా. ఆ నమ్మకం సడలినప్పుడు అద్దం ముందు నిలబడి నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు అని నన్ను నేను పొగుడుకుంటా. నీరసం వస్తే నాలో నేను ఉత్సాహం నింపుకొంటా. ప్రకృతికి నువ్వు ఏది ఇస్తే.. అది కొన్ని రెట్లు ఇస్తుంది. దయచేసి సమయం వృథా చేసుకోవద్దు. అభిమానుల మధ్య సఖ్యత ఉండాలి. హీరోలందరూ బాగున్నారని మేసేజ్ ఇవ్వగలిగితే అభిమానులు కలిసి ఉంటారు. అలా చేసింది మొదట తానేనని అందరికీ తెలుసు. నా తోటి హీరోలందరూ నాతో చాలా బాగుంటారు. చిరంజీవి అభిమానులంటే అందరికీ గర్వకారణంగా ఉండాలి' అని అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement