బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈమె తల్లి కృష్ణ ముఖర్జీ (75) చనిపోయారు. మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
(ఇదీ చదవండి: 'రక్తం అమ్ముకుంటానని అన్నారు': మెగాస్టార్ చిరంజీవి)
'అత్యంత భారమైన మనసుతో మా అమ్మ కృష్ణ ముఖర్జీ కన్నుమూశారనే వార్తని పంచుకుంటున్నాం. ఈ సమయంలో మీ ప్రేమ, ప్రార్థనలు, మద్ధతుకు కృతజ్ఞత తెలుపుతూ.. మాకు తగిన గోప్యత ఇవ్వాలని కోరుతున్నాం' అని కుటుంబ సభ్యులు ఓ నోట్ పంచుకున్నారు.
రాణి ముఖర్జీకి తల్లితో మంచి అనుబంధముంది. మూడేళ్ల క్రితం అంటే 2023లో రిలీజైన 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సినిమాలో బెంగాలీ తల్లి పాత్రలో నటించడానికి తన తల్లే స్ఫూర్తి అని రాణి గతంలో చెప్పింది. ఇకపోతే కృష్ణ ముఖర్జీకి ఇండస్ట్రీతో సంబంధముంది. ఈమె నేపథ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె భర్త, రాణి తండ్రి రామ్ ముఖర్జీ.. ఫిల్మాలయ స్టూడియోస్ సహ వ్యవస్థాపకులు. 2017లో ఈయన కన్నుమూశారు.
(ఇదీ చదవండి: కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)



