ఇరాన్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలపై చేసిన దాడులకు క్షమాపణలు చెప్పారు. ఇకపై పక్కదేశాలపై దాడి చేయమన్నారు. "మీరు మా జోలికి రాకుంటే.. మేము మీ జోలికి రామని" తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తి లేదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అదే విధంగా మీ దేశాలను అమెరికా స్థావరాలుగు మార్చొద్దని.. అక్కడి నుండి అమెరికా తమపై దాడి చేయకుండా చూసుకోవాలని సూచించారు.
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిదాడులతో ఇరాన్ విరుచుకపడింది. ఈ నేపథ్యంలో దుబాయి, కువైట్, బహ్రెయిన్, యుఏఈలతో పాటు ఇతర గల్ఫ్ దేశాలలోని USA స్థావరాలతో ఇరాన్ దాడులు జరిపింది. అక్కడితో ఆగకుండా ఆ దేశంలోని ఆయిల్ రిఫైనరీలు, విమానాశ్రయాలపై మిస్సైల్స్‌తో విరుచుకపడింది. దీంతో ఇరాన్ తీరుపై గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు.


