యుద్ధం వేళ.. ఇరాన్‌లో మళ్లీ భూకంపం | Earthquake of magnitude 4.1 jolts Iran as conflict escalates with US and Israel | Sakshi
Sakshi News home page

యుద్ధం వేళ.. ఇరాన్‌లో మళ్లీ భూకంపం

Mar 7 2026 10:35 AM | Updated on Mar 7 2026 10:46 AM

Earthquake of magnitude 4.1 jolts Iran as conflict escalates with US and Israel

టెహ్రాన్‌: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌కు పశ్చిమాన శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. బందర్ అబ్బాస్‌కు పశ్చిమాన 74 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియా అంతటా యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్‌ ప్రతీకార దాడులతో దాదాపు వారం రోజులుగా ఘర్షణలు జరుగుగున్న నేపథ్యంలో ఇవాళ మళ్లీ భూకంపం సంభవించడం గమనార్హం. 

మరోవైపు, గత మంగళవారం కూడా ఇరాన్ దక్షిణ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ భాగంలో ఉన్న గెరాష్‌లో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుంది. తమ మాట వినకపోతే ఇరాన్‌ సైన్యాన్ని లేకుండా చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement