నైజీరియాలో దారుణం జరిగింది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లు తెగబడ్డారు. ఓ గ్రామంపై దాడి చేసి 300 మందికి పైగా ప్రజలను అపహరించారు. అయితే ఈ దాడి ఏ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులు చేశారనే సంగతి ఇంకా తెలియలేదు.
నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని బార్నో రాష్ట్రంలో శుక్రవారం ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు. నాగోషి ప్రాంతంపై దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేశారు. కాగా ఇటీవల టెర్రరిస్ట్ గ్రూపు బొకోహరమ్‌కు చెందిన తీవ్రవాదులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.
అయితే గత వారం రోజులుగా తరచుగా అక్కడి గ్రామాలపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారి తెలిపారు. స్థానికంగా ఉన్న కొండుగ, మార్టే, జకానా, మైనాక్, అనే జాతుల సమూహాలపై మిలీషియా గ్రూపులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. వారిని అంతమెుందించడంలో అనేక మంది భద్రతా అధికారులు ప్రాణాలు అర్పించారన్నారు.
అయితే నైజీరియాలో ఉగ్రవాదుల దాడులు సర్వ సాధారణంగా మారాయి. అక్కడ మైనింగ్‌పై అధిపత్యం కోసం అక్కడ స్థానికంగా ఉన్న మిలీషియా గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. ఈ దాడులలో వందలమంది ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి అమెరికా తన బలగాలను నైజీరియాలో మోహరించింది


