breaking news
-
కొత్త క్యాబినెట్లో అమిత్ షాకు కీలక బాధ్యతలు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే విస్తరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర మరింత కీలకం కానున్నదనే చర్చ జోరందుకుంది. 2019 మే 30న తొలిసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, 2025 ఆగస్టులో లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న 2,256 రోజుల రికార్డును అధిగమించి, భారత చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారు.2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా చేపడుతున్న ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త తరాన్ని ప్రోత్సహించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉండగా.. అమిత్ షా సాధించిన పరిపాలనా విజయాల కారణంగా ఆయన రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అమిత్ షా తన ఏడేళ్ల హోంమంత్రిత్వ కాలంలో దేశ భద్రత, రాజకీయ వ్యూహాల్లో ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించారు. 2019లో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం, 2023లో కొత్త నేర చట్టాలను తీసుకురావడం వంటివి ఆయన కెరీర్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన కోసం 12కు పైగా చారిత్రాత్మక ఒప్పందాల ద్వారా దాదాపు 11,000 మంది తీవ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి అమిత్ షా తీసుకువచ్చారు. అలాగే, 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా, ఎంపీగా తన సొంత నియోజకవర్గమైన గాంధీనగర్‌లో నిరంతరం పర్యటిస్తూనే, పార్టీ మేనేజ్మెంట్లో సునీల్ బన్సల్, వినోద్ తావ్డే వంటి నేతలను తీర్చిదిద్దారు. 2026 మే నెలలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేశారు. అలాగే, 2026 జూన్‌లో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ‘యమునా జలాల ఒప్పందం కుదర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ బయోడేటా ఆధారంగానే మోదీ క్యాబినెట్లో ఆయనకు మరింత పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
పాలిటిక్స్ ఏమోగానీ.. 'సర్' అయితే ఇక్కడ కూడా నడుస్తుందిగా..!
పాలిటిక్స్ ఏమోగానీ.. 'సర్' అయితే ఇక్కడ కూడా నడుస్తుందిగా..! -
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో వసూళ్లు రాబట్టాయి. మరోవైపు తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల లాంటి స్టార్స్ చేసిన 'పరాశక్తి' ఘోరమైన డిజాస్టర్ అయింది. గతంలో ఓ సందర్భంలో చిత్ర నిర్మాత దీని వల్ల వచ్చిన నష్టాల గురించి చెప్పగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)'పరాశక్తి' తీసిన దర్శకురాలు సుధా కొంగర.. నిర్మాతకు తనకు రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయి ఉన్నారని చెప్పి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పలు కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రం.. అన్ని సమస్యలు దాటుకుని సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇక మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. జూలై 8న తదుపరి విచారణ జరిగే వరకు 'పరాశక్తి' శాటిలైట్ హక్కులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే నిర్మాత తీసిన 'ఇదయం మురళి' మూవీ వచ్చే నెల 10న థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇది విడుదల కాకుండా ఆపాలని సుధా కొంగన తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.సుధా కొంగర విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం దగ్గర పనిచేసింది. 'సాలా ఖాదుస్' మూవీతో డైరెక్టర్ అయింది. దీన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రానికి ఈమెనే దర్శకత్వం వహించింది. స్వతహాగా ఈమె తెలుగు ఆమెనే అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి) -
నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026లో నేడు (జూన్ 30) తొలి సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓ సారి ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో వెస్టిండీస్ అండర్ డాగ్ హోదాలో బరిలోకి దిగి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ దశలో అజేయ జట్టుగా ఫైనల్-4కు చేరింది. వెస్టిండీస్ తమ చివరి రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో (ఇంగ్లండ్, ఐర్లాండ్) చేతుల్లో ఓడినా సెమీస్‌కు చేరడం ఆసక్తికర పరిణామం.ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ జట్టు టీమిండియా సెమీస్ ఆశలను ఆవిరి చేసి ఫైనల్-4కు చేరింది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించడంతో సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ దక్కింది. జులై 2న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-బి టాపర్ ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటుంది. విండీస్-ఆసీస్ తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ టోర్నీలో తాము అండర్ డాగ్స్ అని చెప్పుకుంటూ, అదే తమ బలమని పేర్కొంది."మా నుంచి ఎవరూ విజయం ఆశించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. నేటి సెమీఫైనల్లో ఒత్తిడి అంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుంది. వాళ్లు గెలవాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. కానీ మేం గెలిస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. అందుకే మేం నిర్భయంగా ఆడగలం.వెస్టిండీస్ గతంలో ఎన్నోసార్లు అంచనాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా ప్రపంచకప్‌లలో తమ జట్టు ప్రత్యేకంగా రాణిస్తుంది. తమను తక్కువ అంచనా వేయడం ఆటగాళ్లలో మరింత పోరాటస్ఫూర్తిని పెంచుతుంది" అని చెప్పింది.ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఆ మ్యాచ్‌లో మేం ఒత్తిడికి లోనయ్యాం. కానీ ఎవరైనా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే, మాలో మరో రకమైన జోష్ కనిపిస్తుందని వివరించింది. -
ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న స్టార్ ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా వెటరన్ ఆల్-రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 39 ఏళ్ల హెన్రిక్స్ ఇకపై పోర్చుగల్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో అతడు తన సొంత దేశమైన పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున చివరగా 2021లో ఇంటర్ననేషనల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం రెగ్యూలర్‌గా ఆడుతూ వచ్చాడు. న్యూసౌత్‌వేల్స్‌కు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా తన సేవలను అందించాడు. అయితే హెన్రిక్స్ అనుహ్యంగా గతేడాది మార్చిలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఇప్పుడు ఆసీస్ జట్టులో అవకాశాలు రాకపోవడంతో తన మకాంను పోర్చుగల్‌కు మార్చాడు. అయినప్పటికి బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రం మోయిసెస్ ఆడనున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను పూర్తి చేయాలి. అయితే హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున 2021లో ఆడడంతో అతడి కూలింగ్ పీరియడ్ కూడా పూర్తి అయినట్లే. పోర్చుగల్ తరపున ఆడేందుకు అతడికి ఎలాంటి చిక్కులు లేవు.కాగా హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినప్పటికి, డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతో పాటు 141 లిస్ట్-ఎ, 301 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ, ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2016 విజేతగా నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు అసోసియేట్ దేశానికి మారడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ తన కుటుంబ నేపథ్యం కారణంగా ఇటలీకి మకాం మార్చాడు. 2025లో ఇటలీ తరపున అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.చదవండి: నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ -
'ప్రభాస్‌ను అడిగితే మూడు కోట్లు ఇస్తాడు.. కానీ'
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా రాణించారు. టాలీవుడ్లో దొంగల ముఠా, రైల్వే స్టేషన్, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ అనే వ్యక్తి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అని కృష్ణ మాయ తెలిపారు. ప్రభాస్ యాక్టింగ్‌లో ప్రత్యేక వెరియేషన్ ఉంటుందన్నారు. ఆయన సొంతంగా చిరుత పులి అనే బ్రాండ్‌ను సొంతం చేసుకున్నారని కృష్ణ మాయ కొనియాడారు. ఆయనతో చేసిన ఈశ్వర్ సినిమాతోనే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ఒక డీసీఎంలో ఎక్కి ప్రభాస్ మాతో పాటే చార్మినార్‌కు వచ్చారని తెలిపారు.అప్పుడున్న ప్రభాస్‌కు.. ఇప్పుడున్న ప్రభాస్‌కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారని ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లగలమా? అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అంతా మా అదృష్టమని కృష్ణ మాయ వెల్లడించారు. ప్రభాస్ సాహో మూవీకి కూడా తాను పనిచేశానని పేర్కొన్నారు.'ఇటీవల ఫౌజీ మూవీ టైమ్‌లో ప్రభాస్ దగ్గరికి వెళ్లా. ఆయన నా చేయి పట్టుకుని మరి నాతో మాట్లాడారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు అని చేయి పట్టుకుని అడిగారు. ఒకవేళ నేను ప్రభాస్‌ను అడిగితే రెండు, మూడు కోట్లు ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతం. అలా అడిగితే నా ఫ్రెండ్షిప్తో పాటు మర్యాద కూడా పొద్ది.. నాకు డబ్బులు అవసరం లేదు.. నాకు నేను సంపాదించుకుంటున్నా. ఆ టైమ్‌లో నన్ను చూసిన ప్రభాస్ ఒక పాత స్నేహితుడిని చూసినంతగా ఫీలయ్యాడు' అని కృష్ణ మాయ ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై కృష్ణ మాయ చేసిన కామెంట్స్‌తో టాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!!
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!! -
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహా నగరంలోని సెంట్రల్ రైల్వే మార్గంలో సోమవారం నుంచి కొత్తగా మరో 12 ఏసీ లోకల్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో ముంబైకర్ల ప్రయాణం మరింత కూల్‌గా మారనుంది. ఏసీ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య పెంచినట్లు అధికారులు తెలిపారు.ఈ ఏసీ రైళ్లను ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)– కల్యాణ్ స్టేషన్ల మధ్య నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. దీంతో సెంట్రల్ రైల్వే మార్గంలో స్లో, ఫాస్ట్ మార్గంలో తిరుగుతున్న మొత్తం ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120కి చేరింది. ఇందులో మెయిన్ లేన్‌లో 92 ట్రిప్పులు, హార్బర్ మార్గంలో 28 ట్రిప్పులున్నాయి. అలాగే కొంత కాలంగా కార్ షెడ్డులో నిలిపి ఉంచిన మరో ఏసీ లోకల్ రైలును నడపాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య మరింత పెరగనుంది.ప్రయాణికుల వ్యతిరేకతఏసీ లోకల్ రైళ్లపై సాధారణ ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొత్తగా 12 ఏసీ లోకల్ రైళ్లను పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల సంఖ్య తగ్గిందని, ఫలితంగా వాటిల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రతీరోజు మొత్తం 1,820 లోకల్ రైళ్లు తిరగ్గా అందులో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120 ఉంది. అయితే సోమవారం నుంచి కొత్తగా నడుపుతున్న ఈ ఏసీ రైళ్లను శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో నడపబోమని అధికారులు స్పష్టం చేశారు. విపరీతంగా లోకల్ రైళ్ల రద్దీ ఇప్పటికే సాధారణ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రారంభంలో ఏసీ లోకల్ రైళ్లకు ముంబైకర్ల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో కూడా ఖాళీగా తిరిగాయి. కానీ ఆ తరువాత ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడం మొదలైంది. ప్రస్తుతం పీక్ అవర్స్‌తోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయంలో కూడా ఏసీ లోకల్ రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఈ రైళ్లు ముంబై రైల్వే బోర్డుకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అన్ని రంగాల ప్రయాణికులను ఏసీ లోకల్ రైళ్లు ఆకట్టుకున్నాయి.ఏసీ రైళ్ల సంఖ్య 28కిఇదివరకే హార్బర్ మార్గంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన 14 ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 14 రైళ్లను పెంచారు. దీంతో హార్బర్ మార్గంలో ఏసీ రైళ్ల సంఖ్య 28కి చేరింది. రైల్వే బోర్డు అదనంగా ఆదాయం రాబట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని, పేద ప్రయాణికులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని సాధారణ రైళ్లలో ప్రయాణించేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్రలోకల్ రైల్వే నెట్ వర్క్‌ను విస్తరించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ముఖ్యోద్దేశమని అందులో భాగంగా ఏసీ రైళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఏసీ లోకల్ రైళ్లలో ఆటోమేటిక్ డోరు మూసుకోవడం, తెరుచుకోవడం సిస్టం ఉండటం వల్ల ప్రయాణికులు డోరు వద్ద, ఫుట్ బోర్డుపై నిలబడి లేదా వేలాడుతూ ప్రయాణించే ఆస్కారం ఏ మాత్రం ఉండదని.. ఫలితంగా నడిచే రైలు లోంచి అదుపు తప్పి కిందపడటం లాంటి సంఘటనలు గణనీయంగా తగ్గిపోయాయని అంటున్నారు. -
ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఈ వారం ఓటీటీల్లోకి పలు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మాలీవుడ్ టైమ్స్, అబ్సెషన్ చిత్రాలతో పాటు ఇసకపట్నం, సూపర్ సుబ్బు, మర్మదేశం, ముతస్సీ తదితర సిరీస్‌లు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మలయాళ హారర్ కామెడీ మూవీ ఒకటి స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత)శ్రీనాథ్ బసి, ఫెమినా జార్జ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ సినిమా 'కరక్కం'. గత నెల 28న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరిగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ శుక్రవారం(జూలై 03) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'కరక్కం' విషయానికొస్తే.. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా ఇద్దరు స్నేహితులు ధనుష్(శ్రీనాథ్ భాసి), ఖాజా ఫుల్లుగా తాగి చర్చి స్మశానవాటికలో ఉన్న ఐదు శిలువలను పెకిలించి పారేస్తారు. ఆ తర్వాత వారిని ఐదు దెయ్యాలు వెంటాడటం మొదలుపెడతాయి. ఆ దెయ్యాల నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్') -
ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వివరాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బిహార్ గవర్నర్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడి అనంతరం సైతం భీకరమైన యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఖమేనీ అంత్యక్రియలకు అనుకూల సమయం లభించలేదు. దీంతో ఇంతకాలం పాటు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఎట్టకేలకు జూలై 4 నుంచి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మసూజ్ ఫెజెష్కియన్ ఈ కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం అందించారు. అయితే, అదే సమయంలో ప్రధానమంత్రి ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఈ కార్యక్రమాల్లో స్వయం పాల్గొనలేకపోతున్నారని కేంద్రం తెలిపింది. దీంతో సుప్రీం లీడర్ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటాలు హాజరు కానున్నట్లు పేర్కొంది.ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్జూలై 4న టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. దీనితో అంత్యక్రియల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతాయి. టెహ్రాన్, కోమ్ నగరాల్లో బహిరంగ ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే ఇరాక్ లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు. జూలై 9 న ఖమేనీ సొంత ఊరైన మషహాద్‌లోని ప్రసిద్ధ 'ఇమామ్ రెజా' పుణ్యక్షేత్రంలో జూలై 9న అంతిమ కార్యక్రమం జరగనుంది.
