breaking news
-
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
దక్షిణ బ్రెజిల్‌లోని గువైబా నగరంలో తీవ్ర తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, తుఫాన్ తాకిడికి దాదాపు 114 అడుగుల ఎత్తున్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్ బాగా షేర్ అవుతోంది. సోమవారం మధ్యాహ్నం బ్రెజిల్‌లోని గుయిబా నగరాన్ని తీవ్రమైన తుఫాను ముంచెత్తింది. దీంతో దాదాపు 40 మీటర్ల పొడవైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయింది. ఫాస్ట్-ఫుడ్ అవుట్లెట్ సమీపంలోని హవాన్ రిటైల్ మెగాస్టోర్ ,కార్ పార్కింగ్‌లో ఏర్పాటు చేయబడినఈ విగ్రహాన్ని తీవ్రమైన గాలులు తాకాయి. బలమైన గాలుల ధాటికి తొలుత వంగిపోయిన ఈ విగ్రహం తాకిడి తీవ్రం కావడంతో స్టాట్యూ తల ముక్కలైంది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. పై భాగం మాత్రమే ప్రభావితమైది. అయితే 11 మీటర్లు (36 అడుగులు) పీఠం చెక్కుచెదరకుండా ఉంది. గుయిబా మేయర్ మార్సెలో మారనాటా మాట్లాడుతూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సత్వరమే స్పందించిన అధికారులను ప్రశంసించారు. విగ్రహం కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్నిగుర్తించేందుకు, తీవ్రమైన వాతావరణం తోపాటు, తర అంశాలు పాత్రపై ఆరా తీసేందుకు సాంకేతిక తనిఖీ నిర్వహించబడుతుందని అధికారి ఒకరు చెప్పారు.ఇదీ చదవండి: బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలుగుయిబాలో తుఫాను రియో గ్రాండే డో సుల్ను కూడా చాలా వరకు ప్రభావితం చేసింది. వడగళ్ల వాన, పైకప్పులు, చెట్లు, కూలిపోవడం, తాత్కాలిక విద్యుత్తు అంతరాయం లాంటి సంఘటనలు చోటు చేసు కున్నాయి. భారీ వర్షం కారణంగా కొన్ని వీధులు జలమయమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియాలజీ తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. చలిగాలులే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ మంగళ వారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా 2020లో దీన్ని ఏర్పాటు చేశారు..Video footage shows a forty-meter-tall replica of the Statue of Liberty, located across from a McDonald's within the parking lot of a Havan in the Brazilian city of Guaíba, one of several dozen replicas of the statue located throughout the country, collapsing during a wind and… pic.twitter.com/kUid9lwA3b— OSINTdefender (@sentdefender) December 15, 2025 -
ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..
నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్‌లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..నెల రోజుల్లో నిర్మాణంఎన్ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్‌కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.గతంలో వచ్చిన టెక్నిక్లుదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్‌లు.వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు. -
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
మలేషియాతో మ్యాచ్‌లో భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం పాతిక బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా.. మంగళవారం మలేషియాతో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.దుబాయ్ వేదికగా ఈ యూత్ వన్డేలో భారత ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (7 బంతుల్లో 14) నిరాశపరచగా.. వైభవ్ (Vaibhav Suryavanshi)మాత్రం తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీఅయితే, హాఫ్ సెంచరీ పూర్తైన వెంటనే వైభవ్ సూర్యవంశీ అవుట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. మలేషియా బౌలర్ ముహమ్మద్ అక్రమ్ బౌలింగ్‌లో ముహమ్మద్ ఎన్ ఉర్హానిఫ్నకు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా ఆయుశ్తో కలిసి వైభవ్ తొలి వికెట్‌కు 9 బంతుల్లో 21... రెండో వికెట్‌కు విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra)తో కలిసి 26.. వేదాంత్‌తో కలిసి మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.అర్ధ శతకాలు పూర్తిఇదిలా ఉంటే.. మలేషియాతో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన విహాన్ మల్హోత్రా (7) విఫలం కాగా.. మిగిలిన వారిలో వేదాంత్ త్రివేది (90) తృటిలో సెంచరీ చేజార్చున్నాడు. అభిజ్ఞాన్ కుందు ఏకంగా అజేయ డబుల్ సెంచరీ (125 బంతుల్లో 209)తో దుమ్ములేపాడు. ఫలితంగా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు సాధించింది యువ భారత్.కాగా గ్రూప్-ఎలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో యూఏఈని 234 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అనంతరం దాయాది పాకిస్తాన్‌పై 90 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.. మంగళవారం నామమాత్రపు మ్యాచ్‌లో మలేషియాను ఓడించి అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే.. యూఏఈపై శతక్కొట్టిన వైభవ్.. పాక్‌తో మ్యాచ్ (5)లో మాత్రం విఫలమయ్యాడు.చదవండి: సర్ఫరాజ్‌కు జాక్‌పాట్!.. మాక్ వేలంలో అమ్ముడు పోయిన ప్లేయర్లు వీరే -
సాక్షి కార్టూన్ 16-12-2025
-
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా దుమ్మురేపారు.థియేటర్లలో దీపావళి కానుకగా అక్టోబరు 21న ధామా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 220 కోట్లకు పైగానే రాబట్టింది. అనంతరం అమెజాన్ ప్రైమ్(amazon prime video) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించింది.థామా స్టోరీ ఏంటి..?'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్‌తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్‌కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు
జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు -
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.వెండి రేటు ఇలాబంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది. -
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
కృష్ణా జిల్లా: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
పాన్ ఇండియా సినిమాకే కేరాఫ్‌గా మారింది టాలీవుడ్. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జ, నిఖిల్ లాంటి కుర్ర హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తూ తమ పాపులారిటినీ పెంచుకుంటున్నారు. అదే జోష్‌లో మన సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్లో నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వడం లేదు.మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్ల పాటు సినిమాలను ఆపేసినా కూడా ఆయన మార్కెట్ చెక్కుచెదరలేదు. కానీ పాన్ ఇండియా మార్కెట్లో మాత్రం చిరంజీవి ఫ్లాప్ అవ్వాలి. గాడ్ ఫాదర్ చిత్రంతో పాన్ ఇండియాలో మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరో నటించినా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దరుణంగా బోల్తా పడింది. దీంతో చిరు పాన్ ఇండియా ప్రయత్నాలు వదిలేసి.. మళ్లీ లోకల్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ పక్కా తెలుగు సినిమా. ఇక్కడ హిట్ అయితే చాలు..పాన్ ఇండియా అవసరం లేదనుకొని, అదే రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక బాలయ్య కూడా పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. అఖండ 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ చిరంజీవి కంటే దారుణమే ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 కోసం ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేశాడు. హిందీతో డైలాగులు చెప్పి అలరించాడు. కానీ అవేవి థియేటర్స్‌కి రప్పించలేకపోయాయి. బాలీవుడ్లో అఖండ 2 అట్టర్ ఫ్లాప్ అయింది.ఇక వెంకటేశ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో రాణించాలని ‘సైంధవ్’తో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథలపైనే ఫోకస్ పెట్టాడు.మనో సీనియర్ హీరో నాగార్జున కూడా అంతే. పాన్ ఇండియా పై ఆయనకు మోజే లేదు. సోలోగా రాణించాలనే ఆశే లేదు. కుబేర, కూలి, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కానీ.. హీరోగా మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా టాలీవుడ్ సీనియర్లంతా పాన్ ఇండియా మార్కెట్ వద్ద ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా హిట్ కొడతారో చూడాలి. -
IPL 2026: రచిన్‌కు షాక్.. అత్యధిక ధర పలికింది వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా మంగళవారం ఆక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ సోమవారం మాక్ వేలం (Mock Auction) నిర్వహించగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మాక్ వేలంలో పాల్గొన్న రాబిన్ ఊతప్ప గ్రీన్ కోసం ఏకంగా రూ. 30.50 కోట్లు వెచ్చించాడు.అతడికి కళ్లు చెదిరే మొత్తంఅదే విధంగా.. ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 19 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఐపీఎల్-2025లో పేలవ ప్రదర్శన కారణంగా లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) వదిలేసిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా ఆటగాళ్లలో పృథ్వీ షా నామమాత్రపు ధరకు అమ్ముడుపోగా.. రాహుల్ చహర్ (Rahul Chahar)కు కళ్లు చెదిరే మొత్తం దక్కింది.భారత స్పిన్నర్ రవి బిష్ణోయి కూడా భారీ ధర దక్కించుకున్నాడు. మరి వీరందరితో పాటు మాక్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు, అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా!మాక్ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాళ్లు💰కామెరాన్ గ్రీన్- రూ. 30.50 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్💰పృథ్వీ షా- రూ. 2.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్💰వెంకటేశ్ అయ్యర్- రూ. 6 కోట్లు- ఆర్సీబీ 💰సర్ఫరాజ్ ఖాన్- రూ. 7 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్ 💰లియామ్ లివింగ్‌స్టోన్- రూ. 19 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్💰మతీశ పతిరణ- రూ. 13 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్💰రవి బిష్ణోయి- రూ. 11.50 కోట్లు- రాజస్తాన్ రాయల్స్💰రాహుల్ చహర్- రూ. 10 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్💰గెరాల్డ్ కోయెట్జి- రూ. 8 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్💰అన్రిచ్ నోర్జే- రూ. 7.50 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్💰డేవిడ్ మిల్లర్- రూ. 9.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్💰లుంగి ఎంగిడి- రూ. 6.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్💰ఆకాశ్ దీప్- రూ. 5 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్💰చేతన్ సకారియా- రూ. 6.5 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰జానీ బెయిర్ స్టో- రూ. 2.5 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్💰జేక్ ఫ్రేజర్-మెగర్క్- రూ. 2 కోట్లు- పంజాబ్ కింగ్స్💰వనిందు హసరంగ- రూ. 2 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్💰జేమీ స్మిత్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰విజయ్ శంకర్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰డారిల్ మిచెల్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰క్వింటన్ డికాక్- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్💰మహీశ్ తీక్షణ- రూ. 2 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్💰రాహుల్ త్రిపాఠి- రూ. 75 లక్షలు- కోల్‌కతా నైట్ రైడర్స్💰శివం మావి- రూ. 2.50 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్మాక్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరేబెన్ డకెట్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేకాగా మాక్ వేలంలో కేకేఆర్ తరఫున ఊతప్ప, సన్‌రైజర్స్ తరఫున ఎస్.బద్రీనాథ్, చెన్నై తరఫున సురేశ్ రైనా, ఆర్సీబీ తరఫున అనిల్ కుంబ్లే, గుజరాత్ తరఫున ఛతేశ్వర్ పుజారా, ముంబై ఇండియన్స్ తరఫున అభినవ్ ముకుంద్, ఢిల్లీ తరఫున మొహమ్మద్ కైఫ్, లక్నో తరఫున ఇర్ఫాన్ పఠాన్, పంజాబ్ తరఫున సంజయ్ బంగర్, రాజస్తాన్ తరఫున ఆకాశ్ చోప్రా పాల్గొన్నారు.చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన
