‘షి’వల్యూషన్‌ సునామీ! | Indian women are strengthening their role in household financial management | Sakshi
Sakshi News home page

‘షి’వల్యూషన్‌ సునామీ!

Mar 8 2026 12:01 AM | Updated on Mar 8 2026 12:01 AM

Indian women are strengthening their role in household financial management

ఆర్థిక స్వావలంబన దిశగా భారత మహిళలు

ఫైనాన్స్‌ రంగంలోకి శక్తివంతమైన ఎంట్రీ

కుటుంబ బడ్జెట్‌ నుంచి స్టాక్‌ మార్కెట్‌ దాకా ఆధిపత్యం

ఆర్థిక నిర్ణయాల్లో ముందంజ

పెట్టుబడుల్లో కొత్త దూకుడు

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: భారత మహిళలు ఇపుడు ఇంటికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా ఆలోచిస్తూ, పెట్టుబడులు పెడుతూ, ఆర్థిక స్వావలంబన వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. గతంలోలాగా  కుటుంబ బడ్జెట్‌ పరిమితిలో ఇరుక్కుని ఆరి్ధక ఇబ్బందులతో గడిపేందుకు ఇష్టపడడంలేదు. పెట్టుబడులు, రిటైర్మెంట్, కెరీర్‌ గ్రోత్, ఆర్థిక స్వాతంత్య్రం ఇలా  ప్రతి అంశంలో ముందడుగు వేస్తున్నారు.  భారత మహిళల ఆర్థిక లక్ష్యాలు, అలవాట్లు, ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంటోంది.మహిళల ఈ ఆర్థిక మలుపు దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఇంధనంగా మారింది.  కొత్త బలాన్నిస్తోంది.   

ఒకప్పుడు  మహిళల ఆర్థిక ప్రాధాన్యతలు కుటుంబం కేంద్రంగా ఉండేవి.  పెళ్లి, పిల్లలు వారి స్కూల్‌ ఫీజులు, తర్వాత ఉన్నత చదువుల కోసం పొదుపుగా బతకడం,   పిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం జాగ్రత్త పడడం, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు చేయడం మహిళల ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి . ఇవన్నీ కూడా భర్త ఆధ్వర్యంలో జరిగేవి.  మహిళల పాత్ర ఎక్కువగా ’సపోరి్టవ్‌ ఫైనాన్షియల్‌ మేనేజర్‌’గానే ఉండేది.

ఇప్పుడు కెరీర్‌ అభివృద్ధి, ఆర్థిక స్వాతంత్య్రం, ఈక్విటీ పెట్టుబడులు, రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ వంటి ఆధునిక లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.  కేవలం కుటుంబ సహాయకురాలిగా కాదుం ఫైనాన్షియల్‌ లీడర్‌గా ఎదుగుతున్నారు.   

ఇటీవలి సర్వేలు చెబుతున్న దాని ప్రకారం మహిళల్లో ఆర్థిక అవగాహన గణనీయంగా పెరిగింది.   కుటుంబం చుట్టూ తిరిగిన ఆర్థిక ప్రణాళిక గుమ్మం దాటి స్టాక్‌ మార్కెట్‌ దాకా వెళ్లింది. కొత్తతరం మహిళల్లో నా జీవితం – నా డబ్బు అనే భావన బలపడుతోంది.  స్వతంత్ర ఆర్థిక ఆలోచనలతో ఇప్పుడు మహిళల లక్ష్యాలు మరింత వ్యక్తిగతంగా, శక్తివంతంగా మారాయి 

కొత్త తరహా లక్ష్యాలు: 
 కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్, అప్‌స్కిల్లింగ్‌ 
పూర్తి స్థాయి ఆర్థిక స్వాతంత్య్రం 
 బంగారం దాటి ఈక్విటీ, ముచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు 

స్వంత ఇల్లు కొనుగోలు 
వ్యక్తిగత రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ 
ట్రావెల్, లైఫ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ 
సెల్ఫ్‌ కేర్‌ – హెల్త్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ 

ఎంటర్‌ప్రెన్యూర్షిప్, కెరీర్‌ ఫ్లెక్సిబిలిటీ 
పెట్టుబడుల్లో మహిళల కొత్త ట్రెండ్‌ 
సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)ల ద్వారా క్రమబద్ధమైన పెట్టుబడులు 

డైరెక్ట్‌ ఈక్విటీ ఇన్వెస్టింగ్‌ 
డిజిటల్‌ ట్రేడింగ్‌ – ఫైనాన్స్‌ యాప్‌ల వినియోగం 
రిస్క్‌ అవగాహనతో విభిన్న ఆస్తుల్లో డైవర్సిఫికేషన్‌ 
అత్యవసర నిధులపై ప్రత్యేక దృష్టి.

అంకెల్లో కనబడుతున్న మార్పు
47 శాతం  మహిళలు  ఆర్థిక నిర్ణయాలు స్వయంగా తీసుకుంటున్నారు 
98 శాతం పట్టణ మహిళలు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు
25 శాతానికి పెరిగిన ఈక్విటీ మార్కెట్‌లో మహిళా ఇన్వెస్టర్ల వాటా. 25 శాతానికి చేరిన మహిళా మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement