రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా! | Man Quits Rs 26 Lakh Job Know The Details Here | Sakshi
Sakshi News home page

రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!

Mar 7 2026 8:07 PM | Updated on Mar 7 2026 8:23 PM

Man Quits Rs 26 Lakh Job Know The Details Here

సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వెబ్‌సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్‌లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.

ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.

ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement