breaking news
freelancing
-
ఫ్రీలాన్స్ ఈతరం ఎంపిక..!
గతంతో పోలిస్తే నగరంలోని యువత కెరీర్ ఎంపికలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు పార్ట్‌టైమ్ పనిగా భావించిన ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో నూతన తరం యువతకు ప్రధాన కెరీర్ ఎంపికగా మారుతోంది. సిటీ లైఫ్‌స్టైల్, స్టార్టప్ కల్చర్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి.. ఇలాంటి అంశాలతో ఫ్రీలాన్సింగ్ కొత్త వృత్తి ప్రమాణంగా మారింది. ఓ వైపు ఐటీ, సాఫ్ట్వేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్ జాబ్స్ చేస్తున్న వారి సంఖ్య ఎప్పటిలానే పెరుగుతున్నప్పటికీ.. విభిన్నంగా ఆలోచిస్తూ తమ కెరీర్‌ను కొత్త పంథాల్లో రూపొందించుకుంటున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారికి ఫ్రీలాన్సింగ్ అనువైన వేదికగా మారింది. గచి్చ»ౌలి నుంచి కూకట్పల్లి వరకు.., జిమ్ ట్రైనర్లు, ఆర్టిస్టులు మొదలు., చెఫ్‌లు, రైటర్లు, డ్రైవర్లు, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్లు, డైటీషియన్లు, డిజైనర్లు వరకు అనేక రంగాల ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఫ్రీలాన్స్ వైపు మళ్లుతున్నారు. ‘‘నాకు టైమ్ ఫ్రీడం కావాలనే నిర్ణయంతోనే ఫ్రీలాన్స్ మోడ్ ఎంచుకున్నా అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కవగా పెరుగుతోంది. ఇలా వ్యక్తిగత సమయానికి కట్టుబడి ఉండే ఈ జనరేషన్‌కు ఫ్రీలాన్సింగ్ సూట్ అవుతోంది. ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం ఐటీ లేదా మీడియా రంగాలకు పరిమితం కాదు. ఫిట్నెస్ వెల్నెస్ రంగంలో జిమ్ ట్రైనర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, స్పోర్ట్స్ థెరపిస్ట్‌లు భారీగా అవకాశాలు చూస్తున్నారు. హోమ్ ట్రైనింగ్, కార్పొరేట్ వెల్నెస్ వర్క్‌షాప్‌లు వీరి డిమాండ్‌ను పెంచాయి. ఫుడ్ రంగంలో ప్రైవేట్ చెఫ్‌లు, హోమ్ బేకర్లు, డైటీషన్లు వ్యక్తిగత కన్సల్టెన్సీ, పార్టీ క్యాటరింగ్, స్టార్టప్ ఫుడ్ ప్లానింగ్‌లో పనిచేస్తున్నారు. క్రియేటివ్ రంగంతో గ్రాఫిక్ డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు, బ్రాండ్ స్ట్రాటజిస్టులు, సోషల్ మీడియా మేనేజర్లు.. వంటివి ప్రస్తుతం హాట్ డిమాండ్‌లో ఉన్న వృత్తులు. రీల్స్ కల్చర్, చిన్న బ్రాండ్ల పెరుగుదల, ఈకామర్స్ షూట్స్ ఈ రంగానికి బలం చేకూరుస్తున్నాయి. వీరితో పాటు టెక్ రంగంలో యూఐ/యూఎక్స్ డిజైనర్లు, వెబ్ డెవలపర్లు, యాప్ బిల్డర్లు, టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్లు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ క్లయింట్లతో ప్రాజెక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. హోమ్, లైఫ్‌స్టైల్ సరీ్వసుల్లో ఇంటీరియర్ డిజైనర్లు, బాల్కనీ గార్డెన్ స్పెషలిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ సరీ్వస్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అవకాశాలు పొందుతున్నారు. ఫ్రీలాన్సింగ్ బూస్ట్‌కి ప్రధాన కారణాలు.. నగర యువత ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకోవడానికి కీలక కారణాల్లో ఒకటి టైమ్ ఫ్లెక్సిబిలిటీ. రాత్రిళ్లు పని చేయాలనుకున్నా, ఉదయమే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనుకున్నా.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సౌలభ్యం వీరికి ప్రధాన ఆకర్షణ. అలాగే క్రియేటివ్, స్కిల్‌బేస్డ్ కమ్యూనిటీలు హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్నాయి. కో వర్కింగ్ స్పేసెస్, ప్రొఫెషనల్ స్టూడియోలు, స్కిల్ మీట్అప్స్ వంటివి నెట్వర్కింగ్ అవకాశాలను పెంచుతున్నాయి. స్టార్టప్‌లు కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనిని పొందేందుకు ఫ్రీలాన్సర్లకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. చిన్న ప్రాజెక్ట్‌లు, క్యాంపెయిన్లు, తాత్కాలిక పనుల కోసం ఫ్రీలాన్స్ మోడల్ సరిగ్గా సరిపోతుంది. చాలా మంది యువత ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ చేస్తూ నెలకు రూ.20–రూ.50 వేలు అదనంగా సంపాదిస్తున్నారు. ఇది కూడా ట్రెండ్ వేగంగా విస్తరించడానికి ముఖ్య కారణంగా మారింది. తక్కువగా ఉన్న రంగాలు.. ప్రతి రంగంలో ఫ్రీలాన్స్ ఒకే విధంగా పనిచేయదు. హెల్త్‌కేర్ రంగంలో డాక్టర్లు, నర్సులు, థెరపిస్ట్‌లు చట్టపరమైన నియమాల కారణంగా స్వతంత్రంగా పనిచేయడం కష్టం. బ్యాంకింగ్ ఫైనాన్స్, బ్యాంక్ అధికారులుగా, ఆడిట్ విభాగాల్లో పనిచేసే వారికి ఫ్రీలాన్స్ అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఎయిర్‌లైన్ పరిశ్రమలో కేబిన్ క్రూ, టెక్నికల్ గ్రౌండ్ సిబ్బంది తదితరాలు సంస్థాధారిత ఉద్యోగాలే. మెయిన్‌స్ట్రీమ్ ఇంజనీరింగ్‌లో.. సివిల్, కెమికల్, మెటీరియల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు కంపెనీ ఆధారితంగానే నడుస్తాయి. సిటీ లైఫ్స్టైల్లో ఫ్రీలాన్స్ ప్రభావం.. ఫ్రీలాన్సర్లు నగర ఆర్థిక వ్యవస్థలో సరికొత్త వర్గంగా నిలుస్తున్నారు. ఈవెంట్లు, బ్రాండింగ్ క్యాంపెయిన్లు, హోమ్ సరీ్వసులు, షార్ట్ ఫిల్మ్‌లు, స్టార్టప్ ఆపరేషన్స్.. ఇన్నింటిలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. డిగ్రీ కంటే స్కిల్‌కు విలువ పెరుగుతున్న తరం ఇది. అందువల్ల యువత త్వరగా నూతన నైపుణ్యాలు నేర్చుకుని మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఫ్రీలాన్సింగ్ హైదరాబాద్ యువతకు కేవలం ప్రత్యామ్నాయ మార్గం కాదు.. స్వేచ్ఛ, స్కిల్స్, క్రియేటివిటీ, ఆధునిక సిటీ లైఫ్‌స్టైల్‌కి అద్దం పట్టే కొత్త కెరీర్ పంథా. విభిన్న రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ రాబోయే సంవత్సరాల్లో నగర ఉద్యోగ సంస్కృతిని మరింతగా మార్చే అవకాశం ఉంది. -
కాలు కదపకుండా కాసులు కురిపించే ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రశాంత్‌కు ఆంగ్లభాషలో మంచి పట్టుంది. ఆరునెలల క్రితం వర్క్ అండ్ హైర్ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాడు. సృజనాత్మక కంటెంట్ రైటింగ్ ద్వారా ఉదయం, సాయంత్రం వేళల్లో నాలుగు గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.28 వేలు ఆర్జిస్తున్నాడు. దీపికకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేసే అంశంపై మంచి పట్టుంది. ఒకవైపు ఇంటి పని చేసుకుంటూనే ఆన్లైన్లో ఖాళీ సమయాల్లో పలు కంపెనీల ట్రాన్స్లేషన్లు పూర్తిచేసి నెలకు రూ.25 వేలకు పైగానే ఆర్జిస్తోంది. ఏంటీ నయా ట్రెండ్ అనుకుంటున్నారా..? తమ హాబీల ద్వారా ఆదాయ ఆర్జన చేసేందుకు పలువురు గ్రేటర్ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఖాళీసమయాల్లో ఆడుతూ..పాడుతూ పనిచేస్తూ..ఫ్రీలాన్సర్‌గా డబ్బులు సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారు తాము తీసిన ఫోటోలను కొన్ని వెబ్సైట్లలో తేలికగా విక్రయించుకొని ఆదాయం ఆర్జిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సేవారంగంలో కొత్త తరహా వెబ్సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీసులు అందిస్తున్నాయి. అర్బన్ క్లాప్ డాట్ కామ్, తదితర వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్ అవకాశాలు అందిస్తుండడం విశేషం. జాబ్‌లు ఇలా.. ► హబీకి..టాలెంట్‌కు తగిన ఉద్యోగాన్ని వెదికిపెట్టే వెబ్సైట్లు బోలెడు అదుబాటులోకి వచ్చాయి. ►ఖాళీ సమయాల్లోనూ కాసులు కురిపించే ఉద్యోగాలను ఇంటి నుంచి కాలు కదపకుండా సంపాదించుకునే ఉద్యోగాలకే సిటీజన్లు ఓటేస్తున్నారు . ►గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వృత్తినిపుణులు ఇలా..మహానగరం పరిధిలో ఇలా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తూ నెలకు పది వేల నుంచి లక్షకు పైగా ఆర్జిస్తున్నవారు వేలాదిమంది ఉన్నారు. ►ప్రధానంగా మెడికల్ ట్రాన్స్స్కిప్షన్, ట్రాన్స్లేషన్, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫోటోగ్రఫి, ట్రావెల్ ఎక్స్పర్ట్, ఫుడ్‌బ్లాగర్, ఇంటీరియర్ డిజైనింగ్, మొబైల్ యాప్ తయారీ, వెబ్సైట్ మేకప్ తదితర ఫ్రీలాన్స్ జాబ్స్‌కు సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారు. ►మహానగరం పరిధిలో ఇంటర్నెట్ వినియోగం 80 శాతానికి పైగా ఉండడంతో ఈ ఫ్రీలాన్స్ జాబ్స్‌కు క్రేజ్ పెరిగిపోయింది. వెబ్సైట్లు కొన్ని.. అప్‌వర్క్, వర్క్ అండ్ హైర్, ఫ్రీలాన్సర్.కామ్, ట్రూలాన్సర్, ఫైవర్, వీటికితోడు రెగ్యులర్ జాబ్ వెబ్‌సైట్స్ అయిన షైన్, లింక్డిన్, ఇండీడ్ లాంటి వాటిలోనూ ఫ్రీలాన్స్ జాబ్స్ వెతుక్కునే అవకాశం ఉంది. -
ఆ కొలువులకే టెకీల ఓటు
సాక్షి, బెంగళూర్: నూతన టెక్నాలజీపై పనిచేస్తున్న టెక్నోక్రాట్లు ప్రస్తుతం ఫ్రీలాన్స్ వర్క్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే సంస్థలో పూర్తికాల ఉద్యోగులుగా పనిచేయడం కంటే వివిధ సంస్థలకు సేవలందిస్తూ ఎక్కువ మొత్తం ఆర్జించేందుకే వారు మొగ్గుచూపుతున్నారని తాజా అథ్యయనం తేల్చింది. ఒకే కుర్చీకి రోజంతా అతుక్కుపోయేందుకు నవతరం టెకీలు ఎంతమాత్రం ఇష్టపడటం లేదని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నూతన టెక్నాలజీల్లో పనిచేసేందుకు నిపుణుల కొరత ఏర్పడటం కూడా టెకీ ఫ్రీలాన్సర్లకు పలు అవకాశాలను ముందుకు తెచ్చింది. సంఖ్యాపరంగా 1.5 కోట్ల మంది స్వతంత్ర ఉద్యోగులున్నభారత్ అమెరికా (6 కోట్లు) తర్వాతి స్ధానంలో నిలిచింది. ప్రస్తుతం భారత టెకీ ఫ్రీలాన్సర్లు డేటా విజువలైజేషన్, డేటా మైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాల్లో పనిచేస్తున్నారని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ లెర్నింగ్ సీఈవో ఏపీ రామభద్రన్ తెలిపారు. ఇప్పటివరకూ పూర్తిస్దాయి ఉద్యోగులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఫ్రీలాన్సర్లుగా మారడంతో ఆయా రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఐటీ కంపెనీలు నూతన నైపుణ్యాలు, టెక్నాలజీలను సంతరించుకునే క్రమంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఫ్రీలాన్సర్లుగా ఆహ్వానిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వేదిక ఫ్రీలాన్సర్.కామ్‌లో నమోదు చేసుకున్న వారిలో అత్యధికులు భారతీయులే. ఈ వెబ్సైట్లో నమోదైన వారిలో 20 శాతం మంది భారతీయులున్నారు. టెకీల ఆలోచనాధోరణిలో మార్పులకు ఇది అద్దం పడుతున్నదని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్లో.. భారత్ టాప్
ఫ్రీలాన్సింగ్.. ఆన్లైన్ జాబ్స్.. పేరు ఏదైనా ఉద్దేశం ఒకటే. ఇంట్లో కూర్చొని నచ్చిన సమయంలో.. మెచ్చిన విభాగంలో పనిచేసే అవకాశం. ఇది ఇప్పుడు నిరుద్యోగ యువతకు చక్కటి ఆదాయ మార్గం.. శాశ్వత ఉద్యోగం లభించలేదనే వేదన నుంచి ఉపశమనం కల్పిస్తున్న సాధనం. భారత యువత ఈ అవకాశాన్ని శరవేగంగా అందిపుచ్చుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన.. ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన తాజా నివేదికలో ఇది స్పష్టమైంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి ప్రొఫెషనల్ సర్వీసెస్ వరకు.. ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్లో భారతదేశం నెం.1గా నిలిచిందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల వారీగా ఫ్రీలాన్సింగ్ అవకాశాలపై విశ్లేషణ.. ఫుల్‌టైమ్ జాబ్స్ కష్టమే ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్‌టైమ్ జాబ్స్ దొరకడం అంత తేలికేమీకాదు. అత్యాధునిక టెక్నాలజీ, జాబ్ మార్కెట్ పోటీ పరిస్థితుల కారణంగా ఫుల్‌టైమ్ కొలువులకు కోతపడటం ఖాయంగా కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం. అనువుగా ఫ్రీలాన్సింగ్ ఫుల్‌టైమ్ జాబ్స్ పరంగా ఓ వైపు ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల కల్పనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను సైతం తోసిరాజని నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. – ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్ నివేదిక ఈ రెండు విశ్లేషణలు ప్రస్తుతం జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. ‘ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్’ విడుదల చేసిన ‘ఆన్లైన్ లేబర్ ఇండెక్స్’ చూశాక అంగీకరించాల్సిందే. ఓవైపు లక్షల సంఖ్యలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఖాళీగా ఉండకుండా చేతికందిన అవకాశాలతో ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ ద్వారా ఉపాధి మార్గాలు వెతుక్కుంటోంది. సాఫ్ట్వేర్ టు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన నివేదికలో ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ పరంగా భారత్ టాప్‌లో ఉంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ నుంచి ప్రొఫెషనల్ సర్వీసెస్ వరకు పలు విభాగాల్లో ముందంజలో నిలిచింది. ఆఫీసులో ఏసీ గదుల్లో పనిచేయాలని ఉవ్విళ్లూరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ విభాగంలోనే ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ అత్యధికంగా ఉండటం విశేషం. ఆన్లైన్ విధానంలో మానవ వనరులను అందించడంలో 24 శాతంతో భారత్ నెం.1గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ 16 శాతం, అమెరికా 12 శాతం మంది ఆన్లైన్ ఉద్యోగులను అందిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం ఆరు విభాగాలు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ కల్పన పరంగా ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్ ఆరు విభాగాల్లో సర్వే నిర్వహించింది. అవి.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ; క్రియేటివ్ అండ్ మల్టీ మీడియా; సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్; రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్; క్లరికల్ డేటా ఎంట్రీ; ప్రొఫెషనల్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఎంప్లాయిమెంట్ వాటా: 55 శాతం ర్యాంకింగ్: 1 కారణాలు: టెక్నాలజీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనుకుంటున్నాయి. ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత సాఫ్ట్వేర్ నిపుణులను పూర్తిస్థాయిలో నియమించుకోలేక ఆన్లైన్లోనే సేవలను పొందుతున్నాయి. విదేశీ సంస్థలు.. జాబ్ పోర్టల్స్, సోషల్ నెట్వర్క్స్ ద్వారా.. ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొన్ని విదేశీ సంస్థలు ఔట్ సోర్సింగ్ విధానంలో భారత్‌లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఆ స్వదేశీ కంపెనీలు సరితూగే నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటున్నాయి. క్రియేటివ్ అండ్ మల్టీ మీడియా ఎంప్లాయిమెంట్ వాటా : 13 శాతం ర్యాంకింగ్: 2 కారణాలు: వీడియో గేమింగ్, ఆన్లైన్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ వంటి రంగాల్లో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. అంతే స్థాయిలో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వీటికి పూర్తిస్థాయి ఉద్యోగుల కంటే ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ ఎంప్లాయిస్ మేలని కంపెనీలు భావిస్తున్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ ఎంప్లాయిమెంట్ వాటా: 12 శాతం ర్యాంకింగ్: 3 కారణాలు : ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఈ–కామర్స్ సంస్థలు, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్‌కూ ఆన్లైన్ విధానాన్ని ఎంపిక చేసుకుంటుండటం తెలిసిందే. ఉన్నత స్థాయిలో చక్కటి మార్కెటింగ్ వ్యూహాలు రచించేందుకు, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు ఈ రంగంలోని నిపుణుల సేవలను ఆన్లైన్లో పొందుతున్నాయి. రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ఎంప్లాయిమెంట్ వాటా: 8 శాతం ర్యాంకింగ్: 4 కారణాలు: మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ నిపుణుల అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ సంస్థలు, ఇతర దేశాల్లో ప్రధాన కేంద్రాలను నెలకొల్పి స్థానికంగా కన్సల్టింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఈ విభాగంలో అవకాశాలు కల్పిస్తున్నాయి. క్లరికల్ అండ్ డేటా ఎంట్రీ ఎంప్లాయిమెంట్ వాటా: 7 శాతం ర్యాంకింగ్: 5 కారణాలు: చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్.. తమ క్లయింట్లకు డాక్యుమెంటేషన్, డేటాఎంట్రీ కోసం సొంతంగా ఆన్లైన్ విధానంలో సేవలందించే వారిని నియమించుకుంటున్నారు. కొన్ని ప్రముఖ ఆన్లైన్ జాబ్‌పోర్టల్స్ కూడా ఇందులో భాగస్వాములవుతున్నాయి. సంస్థలకు, వ్యక్తులకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ.. అవసరమైన డాక్యుమెంటేషన్, డేటాఎంట్రీ విధుల నిర్వహణకు ఆన్లైన్లో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్న వారిని నియమిస్తున్నాయి. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎంప్లాయిమెంట్ వాటా: 5 శాతం ర్యాంకింగ్: 6 కారణాలు: కొత్త సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. మరెన్నో కంపెనీలు వ్యాపార విస్తరణ దిశగా అడుగులేస్తున్నాయి. మార్కెట్లో ముందుండేలా వ్యూహాలు రచించేందుకు అవసరమైన నిపుణుల సేవలను ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ పద్ధతిలో పొందుతున్నాయి. అనుభవజ్ఞులు, సంబంధిత రంగంలో నిష్ణాతులైన పరిశోధకులు, ఫ్రొఫెసర్లకు ప్రాధాన్యమిస్తున్నాయి. -
రోజుకు రూ. 46 వేల సంపాదన!!
ఉద్యోగాలు చేసుకుంటే ఏమొస్తుంది.. హాయిగా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే మేలు కదా అంటున్నారు చాలామంది. బుద్ధి పుట్టినప్పుడు పని చేయొచ్చు.. లేదంటే ఎక్కడికైనా వారం పదిరోజుల పాటు అలా తిరిగి రావచ్చు, ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఒకళ్ల గురించి భయపడనక్కర్లేదు.. దానికితోడు పారితోషికం కూడా జీతం కంటే బాగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా ఫ్రీలాన్సింగ్ చేసుకునేవాళ్లు రోజుకు ఏకంగా రూ. 46 వేల వరకు కూడా సంపాదిస్తున్నారట. 'ఫ్లెక్సింగ్ ఇట్' అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఐదేళ్లలోపు అనుభవం ఉన్నవాళ్లయితే రోజుకు రూ. 8వేలు, 5 నుంచి 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్నవాళ్లయితే రోజుకు రూ. 19వేలు, 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవాళ్లు రోజుకు రూ. 46 వేల వరకు ఫ్రీలాన్సింగ్‌లో సంపాదిస్తున్నారట. ఫ్రీలాన్సింగ్‌లో అవకాశాల కోసం ఎదురుచూసే ప్రొఫెషనల్స్‌కు, వాళ్లతో పని చేయించుకోవాలని చూసే సంస్థలకు మధ్య వారధిగా 'ఫ్లెక్సింగ్ ఇట్' సంస్థ పనిచేస్తుంది. దాదాపు 2,500 మంది ప్రొఫెషనల్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పై వివరాలను ఈ సంస్థ ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఆరు నెలల పాటు ఈ డేటా సేకరించారు. ఐదేళ్ల వరకు అనుభవం ఉన్నవారిలో ఉత్పాదక రంగం, ఆర్థిక రంగం, సేల్స్ లాంటి రంగాల్లో ఫ్రీలాన్సర్లకు అత్యధికంగా చెల్లిస్తున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో ఎక్కువగా ఫైనాన్స్, జనరల్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ లాంటి రంగాలలో ఎక్కువ చెల్లింపులు వస్తున్నాయి. ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సేవలు, ఈ కామర్స్ లాంటి రంగాలలో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు బాగున్నట్లు తెలుస్తోంది.


