యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్ | Robert Kiyosaki Says War Is Profitable Reflects on the Vietnam War and Warns About the Military Industrial Complex | Sakshi
Sakshi News home page

యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్

Mar 7 2026 6:47 PM | Updated on Mar 7 2026 9:18 PM

Robert Kiyosaki Says War Is Profitable Reflects on the Vietnam War and Warns About the Military Industrial Complex

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్‌గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.

ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం

యుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement