కారుకు బంపర్ గార్డ్.. ఫైన్ కట్టాల్సిందే! | Bumper Guards Banned In India and What Penalties You Could Face | Sakshi
Sakshi News home page

కారుకు బంపర్ గార్డ్.. ఫైన్ కట్టాల్సిందే!

Mar 7 2026 9:12 PM | Updated on Mar 7 2026 9:15 PM

Bumper Guards Banned In India and What Penalties You Could Face

భారతదేశంలో చాలామంది వాహనదారులు కారు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఉపకరణాలను జోడించుకుంటూ ఉంటారు. అదులో ఒకటి బంపర్ గార్డ్. దీనినే సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని పిలుస్తారు. ఈ మెటల్ బార్‌లు వాహనం యొక్క ముందు లేదా వెనుక బంపర్‌పై అమర్చబడి ఉంటాయి. ఇవి సాధారణంగా SUVలు లేదా పెద్ద కార్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి ఇండియాలో చట్ట విరుద్ధం అని తెలుసా?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017లో అధికారికంగా బుల్ బార్‌లను నిషేధించింది. ఈ నియమం దాదాపు అన్ని వాహనాలను వర్తిస్తుంది.

ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం!
చూడటానికి బంపర్ గార్డ్‌లు వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ భద్రతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వాహనం లోపల ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం కలిగిస్తాయి. కారులోని సెన్సార్లు ఢీకొనే శక్తిని గుర్తించి ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యేలా చేస్తాయి. కానీ కారు ముంచు భాగంలో ఉన్న బుల్ బార్‌లు ఈ సెన్సార్‌లపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పనిచేయకుండా చేస్తాయి.

బుల్ బార్‌లు పాదచారులకు కూడా హాని కలిగిస్తాయి. ఇవి దృఢంగా ఉండటం వల్ల.. అనుకోని సమయంలో ప్రయాణికులను ఢీ కొంటే తీవ్రమైన గాయలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి వాహనంలో ప్రయాణించేవారికి మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.

జరిమానా ఇలా..
బుల్ బార్‌ను ఏర్పాటు చేయడం అనేది మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 190, 191 కింద నేరం. కాబట్టి వాహనదారులకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బంపర్ గార్డును ఏర్పాటు చేసుకుని డ్రైవర్ లేదా వాహన యజమాని పట్టుబడితే, జరిమానాలు రూ. 1000 - రూ. 5000 వరకు ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై వాహనం బుల్ బార్‌ను ఉపయోగిస్తుంటే అక్కడికక్కడే తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement