టీ20 ప్రపంచకప్ 2026 క్లోజింగ్ సెర్మనీ ఘనంగా జరుగనుంది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగబోయే భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ గ్రాండ్ ఈవెంట్ షెడ్యూలైంది.
ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ నృత్య, గాన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. Livin’ La Vida Loca, She Bangs వంటి హిట్ పాటలతో అతను అభిమానులను ఉర్రూతళూగించనున్నాడు.
ఈ ఈవెంట్‌లో ప్రముఖ పంజాబీ సింగర్ సుఖ్‌బీర్, ఫేమస్ గాయని ఫాల్గుని పాఠక్ కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ వేడుకలో గ్లోబల్ హిట్స్‌తో పాటు దేశీ అంథమ్స్ కూడా వినిపించనున్నాయి. రికీ మార్టిన్ అంతర్జాతీయ ధమాకా ప్రదర్శన ఇస్తే, సుఖ్‌బీర్, ఫాల్గుని భారతీయ రుచిని జోడించనున్నారు.
ఈ కార్యక్రమం నరేంద్ర మోడి స్టేడియంలోనే మ్యాచ్ ప్రారంభానికి (7 గంటలకు) గంటన్నర ముందు (సాయంత్రం 5:30) మొదలవుతుంది. ఈ ఈవెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే JioHotstar యాప్ మరియు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
కాగా, ఈ టోర్నీకి సబంధించి ప్రారంభ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్‌లో నోరా ఫతేహి తన వైవిధ్యభరితమైన డాన్స్‌తో అలరించగా, రిషభ్ రిఖిరామ్ శర్మ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.


