Ricky Martin
-
ఘనంగా వరల్డ్‌కప్ క్లోజింగ్ సెర్మనీ.. ప్రత్యేక ఆకర్షణగా రికీ మార్టిన్
టీ20 ప్రపంచకప్ 2026 క్లోజింగ్ సెర్మనీ ఘనంగా జరుగనుంది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగబోయే భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ గ్రాండ్ ఈవెంట్ షెడ్యూలైంది. ఈ ఈవెంట్లో అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ నృత్య, గాన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. Livin’ La Vida Loca, She Bangs వంటి హిట్ పాటలతో అతను అభిమానులను ఉర్రూతళూగించనున్నాడు.ఈ ఈవెంట్లో ప్రముఖ పంజాబీ సింగర్ సుఖ్బీర్, ఫేమస్ గాయని ఫాల్గుని పాఠక్ కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ వేడుకలో గ్లోబల్ హిట్స్‌తో పాటు దేశీ అంథమ్స్ కూడా వినిపించనున్నాయి. రికీ మార్టిన్ అంతర్జాతీయ ధమాకా ప్రదర్శన ఇస్తే, సుఖ్బీర్, ఫాల్గుని భారతీయ రుచిని జోడించనున్నారు. ఈ కార్యక్రమం నరేంద్ర మోడి స్టేడియంలోనే మ్యాచ్ ప్రారంభానికి (7 గంటలకు) గంటన్నర ముందు (సాయంత్రం 5:30) మొదలవుతుంది. ఈ ఈవెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే JioHotstar యాప్ మరియు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ టోర్నీకి సబంధించి ప్రారంభ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్లో నోరా ఫతేహి తన వైవిధ్యభరితమైన డాన్స్‌తో అలరించగా, రిషభ్ రిఖిరామ్ శర్మ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. -
విడాకులు తీసుకున్న జంట.. ఇలా కూడా ఉంటారా బ్రో!
సాధారణంగా మన భార్య, భర్తలు విడాకులు తీసుకునే వార్తలు వింటుంటాం. భార్య, భర్తల మధ్య మనస్పర్థలతో విడాకుల కోసం కోట్లు మెట్లెక్కతుంటారు. కానీ.. ఈ విడాకులు గురించి వింటే మాత్రం ఇదేం పోయే కాలం రా నాయనా అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ విడాకులు తీసుకుంది జంట కాదు.. ఇద్దరు ఘనులే. ఇంతకీ ఆ ఇద్దరి కథేందో జర చూద్దాం పదండి. (ఇది చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా! ) అమెరికాలోని లాస్ఎంజిల్స్కు చెందిన సంగీత సంచలనం రికీ మార్టిన్, జ్వాన్ యోసెఫ్ అనే ఇద్దరు పురుషులు 2018లో వివాహం చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే.. పెళ్లయిన దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు జెంట్స్ పెళ్లి చేసుకోవడం.. అది మళ్లీ డైవర్స్ తీసుకోవడమేంటని తెగ చర్చించుకుంటున్నారు. నోట్లో రాస్తూ.. "మా పిల్లల పట్ల ప్రేమ, గౌరవంతో మా వివాహాన్ని ముగించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ఆరేళ్లలో మేము జంటగా అద్భుతమైన క్షణాలు ఆస్వాదించాం. దయచేసి మా నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యకరమైన కుటుంబం కోసం.. మా పిల్లల కోసం స్నేహపూర్వకమైన సంబంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. మా పట్ల ఉన్న ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, ప్రేమను నిలబెట్టుకుంటాం.' అంటూ ప్రత్యేకంగా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మార్టిన్, యోసెఫ్‌కు 2018లో కుమార్తె లూసియా జన్మించగా.. 2019లో కుమారుడు రెన్ పుట్టారు. అయితే మార్టిన్‌కు ఇదివరకే 2008లో జన్మించిన మాటియో, వాలెంటినో అనే కవల పిల్లలు కూడా ఉన్నారు. యోసెఫ్ ఒక చిత్రకారుడు కాగా.. ఆయన తన వృత్తిలో ప్రతిభకు గానూ అనేక అవార్డులను గెలుచుకున్నాడు. మార్టిన్ ఆపిల్ టీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే పీరియడ్ కామెడీ "పామ్ రాయల్"లో నటించారు. ఇందులో క్రిస్టెన్ విగ్, లారా డెర్న్, అల్లిసన్ జానీ, కరోల్ బర్నెట్లతో కలిసి మార్టిన్ కనిపిస్తారు. కాగా.. 2015లో డేటింగ్ ప్రారంభించిన మార్టిన్, యోసెఫ్.. 2016లో యామ్ఫార్ ఇన్స్పిరేషన్ గాలాలో అఫీషియల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత వీరిద్దరు 2018లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో!) -
రిక్కీ... తలకెక్కి...
‘పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటార’’ని పెద్దలంటే... ‘‘అభిమానం ముదిరితే ఆపరేషన్లు చేయించుకుంటార’’ని ఫ్రాన్ మరియానో నిరూపిస్తున్నాడు. అర్జెంటీనాకు చెందిన ఈ 32 ఏళ్ల యువకుడు... పాప్ సింగర్ రిక్కీమార్టిన్కి వీరాభిమాని. ‘పాప్’నే కెరీర్‌గా చేసుకుని తన రోల్ మోడల్ బాటనే ఎంచుకున్నాడు. అయితే రోజు రోజుకూ రిక్కీ అంటే పిచ్చి తలకెక్కిన మరియానో... అచ్చం రిక్కీ ఫేస్‌లా తన ఫేస్ మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టాడు. నుదురు, ముక్కు, చెంపలు... వగైరాలను లైపోసక్షన్‌తో షేప్‌లు మార్చేసిన ఈ మార్టిన్ మానియాక్... ఇప్పటికే అరడజనుకుపైగా సర్జరీలు చేయించుకున్నాడు. ఓ వైపు నొప్పులు, మరోవైపు ఖర్చులు.. వీటన్నింటినీ పట్టించుకోకుండా... ‘‘కోతలెన్నయినా భరిస్తా...రిక్కీ నేనే అనిపిస్తా’’ నంటున్న మరియానో సైతం ఒక రేంజ్లో పాప్ గాయకుడే. అయినా పాపం తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తరచు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడట. రిక్కీలా ముఖం మారితేనైనా మారియానో నుదుటి రాత మారుతుందేమో!


