రిక్కీ... తలకెక్కి... | Role Model | Sakshi
Sakshi News home page

రిక్కీ... తలకెక్కి...

Jan 22 2015 11:00 PM | Updated on Sep 2 2017 8:05 PM

రిక్కీ...  తలకెక్కి...

రిక్కీ... తలకెక్కి...

‘పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటార’’ని పెద్దలంటే... ‘‘అభిమానం ముదిరితే ఆపరేషన్లు చేయించుకుంటార’’...

‘పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటార’’ని పెద్దలంటే... ‘‘అభిమానం ముదిరితే ఆపరేషన్లు చేయించుకుంటార’’ని ఫ్రాన్ మరియానో నిరూపిస్తున్నాడు. అర్జెంటీనాకు చెందిన ఈ 32 ఏళ్ల యువకుడు... పాప్ సింగర్ రిక్కీమార్టిన్‌కి వీరాభిమాని. ‘పాప్’నే కెరీర్‌గా చేసుకుని తన రోల్ మోడల్ బాటనే ఎంచుకున్నాడు. అయితే రోజు రోజుకూ రిక్కీ అంటే పిచ్చి తలకెక్కిన మరియానో... అచ్చం రిక్కీ ఫేస్‌లా తన ఫేస్ మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టాడు. నుదురు, ముక్కు, చెంపలు... వగైరాలను లైపోసక్షన్‌తో షేప్‌లు మార్చేసిన ఈ మార్టిన్ మానియాక్... ఇప్పటికే అరడజనుకుపైగా సర్జరీలు చేయించుకున్నాడు. ఓ వైపు నొప్పులు, మరోవైపు ఖర్చులు.. వీటన్నింటినీ పట్టించుకోకుండా... ‘‘కోతలెన్నయినా భరిస్తా...రిక్కీ నేనే అనిపిస్తా’’ నంటున్న మరియానో సైతం ఒక రేంజ్‌లో పాప్ గాయకుడే. అయినా పాపం తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తరచు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడట. రిక్కీలా ముఖం మారితేనైనా మారియానో నుదుటి రాత మారుతుందేమో!
 
 

Advertisement
 
Advertisement
Advertisement