breaking news
Falguni Pathak
-
క్వీన్ ఆఫ్ దాండియాతో నీతా అంబానీ గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన నృత్యంతో మరోసారి ఆడియెన్స్‌ను అలరించారు. అమ్మవారి పూజలు, ప్రార్థనలు మొదలు గర్బా స్టెప్పుల దాకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రులు తన చిన్న నాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఫల్గుణి పాఠక్‌తో కలిసి స్టెప్పులు వేసిన వీడియో వైరల్‌గా మారింది.నీతా అంబానీ నేతృత్వంలో ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో దాండియా నైట్ అత్యంత ఉత్సాహంగా నడిచింది. ఈ వేడుకల్లో ఫల్గుణి పాఠక్ భక్తి, పాటలు పాడి భక్తులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా నీతా అంబానీతో కలిసి వేసిన దాండియా విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by Jio World Convention Centre (@jioworldconventioncentre)ముఖ్యంగా నీతా అంబానీ తన బాల్య జ్ఞాపకాలతో పాటు, పాఠక్‌తో గత పాతికేళ్లుగా తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడారు. తాను చిన్నప్పుడు, నవరాత్రి తొమ్మిది రాత్రులు నృత్యం చేసేదాన్నని గుర్తు చేసుకున్నారు. దసరా, నవరాత్రి పండుగలు ఎపుడూ తనకు భక్తి ,ఐక్యత, రాత్రి భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. కాగా గుజరాత్‌లోని సంగీత కుటుంబంలో పుట్టిన ఫల్గుణి పాఠక్ గర్బా , దాండియా డ్యాన్స్‌లకు పెట్టింది. అందుకే "దాండియా రాణి" అని పేరొందింది. ఎన్నో పాప్గీతాలను ఆలిపించిన ఫల్గుణి తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది. ఇదీ చదవండి: ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్‌లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్‌షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్‌ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్‌గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్‌తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్‌తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్‌కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్‌గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్‌లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్‌లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్‌లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్‌తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
90లలో ఉర్రూతలూగించిన పాట ..ఇప్పటికీ వన్నె తగ్గని స్టెప్పులు!
కొన్ని పాటలకు భాషతో సంబంధం ఉండదు. కాల పరిమితి ఉండదు. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా వాటిని మర్చిపోలేరు. ఒకవేళ మర్చిపోయినా.. మళ్లీ ఒక్కసారి వింటే చాలు.. మనసు గాల్లో తేలి ఆడుతుంది. అలాంటి పాటల్లో ఫాల్గుని పాథక్ ఆలపించిన 'చూడి జో కర్నె కే హాథోన్ మే’ సాంగ్ ఒకటి. 90లలో అమ్మాయిలను.. కుర్రకారును ఊపు ఊపేసిన పాట ఇది. నార్త్ నుంచి మొదలుపెడితే సౌత్, ఈస్ట్ అనే సంబంధం లేకుండా ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఏ ఫంక్షన్లో అయినా ఈ పాట ఉండాల్సిందే. పాఠశాల, కళాశాల వార్షికోత్సవం ఉందంటే చాలు.. ఈ పాటకు స్టెప్పులేయాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాల కింద విడుదలైన ఈ ప్రైవేట్ ఆల్పబ్.. ఇప్పటికీ చాలా స్పెషల్. ఈ పాట లిరిక్స్ గానీ, బ్లూ లెహంగాలో రియా సేన్ సిగ్నేచర్ స్టెప్పులు కానీ ఇప్పటికీ మర్చిపోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో పలు మార్లు ఈ పాటను ప్లే చేశారు. ఇప్పటికీ పలువురు ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిన్న వచ్చిన పాటను నేడు గుర్తుపెట్టుకోకవడమే కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో.. 20 ఏళ్ల నాటి పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చేయడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Nina | German Bollywood Dancer (@naina.wa) A message to the future Generations, Don't let this song die..#90skid pic.twitter.com/iDTSNmZtn3 — 90skid (@memorable_90s) August 29, 2023 -
మంచి మంచి పాటల్ని చెడగొడుతున్నారు కదయ్యా!
ముంబై: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్లో అయినా పాత హిట్ సాంగ్స్‌ను రీమిక్స్‌లు, రీ-రీమిక్స్‌లు, రీక్రియేషన్ల పేరుతో ఇప్పటి తరాలకు అందిస్తుండడం చూస్తున్నాం. అదే సమయంలో చాలావరకు కొత్తవాటిపై విమర్శలు వెల్లువెత్తుతుండం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా.. శ్రీలంక గాయని యోహానీతో ‘మనికే మేగే’ సాంగ్‌ను.. ‘థ్యాంక్ గాడ్’ సినిమా కోసం ఆమెతోనే పాడించి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ కంపోజిషన్‌పై మాములు తిట్లు పడడం లేదు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ పాటను చెడగొట్టే యత్నమూ జరుగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ‘మైనే పాయల్ హై ఛన్‌కాయి’ సాంగ్ గుర్తుందా? అప్పట్లో నార్త్-సౌత్ తేడా లేకుండా ఊపేసిన సాంగ్. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకున్న సాంగ్ అది. సింగర్ నేహా కక్కర్ ‘ఓ సజ్నా’ పేరిట రీమిక్స్ చేయించి వదిలింది టీ సిరీస్. దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నేహా కక్కర్ పాడిన పలు రీక్రియేషన్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలో. ఇక ఒరిజినల్ కంపోజర్ & సింగర్ ఫాల్గుని పాథక్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్ షేర్ చేసిన కొన్ని మీమ్స్‌ను, విమర్శలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్ చేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. video credits: T-Series ఫాల్గుని పాడిన మైనే పాయల్ హై ఛన్‌కాయి ఒరిజినల్ సాంగ్ 1999లో రిలీజ్ అయ్యింది. వివన్ భాటేనా, నిఖిలా పలాట్లు ఇందులో నటించారు. కాలేజీ షోలో తొలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది. ఇక కొత్త వెర్షన్ ఓ సజ్నాకు తన్షిక్ బాగ్చీ మ్యూజిక్ అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు. videoCredits: FalguniPathakVEVO -
జనం మెచ్చేది జానపదాలనే!
న్యూఢిల్లీ: 1990లలో పాప్ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫాల్గుణి పాఠక్ ప్రేమ, దాండియా గేయాలతో యువతరాన్ని మంత్రముగ్ధులను చేసిందని చెప్పుకోవచ్చు. మనదేశంలో జానపద గీతాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఈమె చెబుతోంది. ముంబైలోని నవరాత్రి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న ఈ 42 ఏళ్ల గాయని ‘ఇంద్ర మెరువ గయి’, ‘చమ్ చమ్ పాయలియా’ వంటి గేయాలతో వీనుల విందు చేసింది. ‘పాప్ గేయాలకంటే జానపద గీతాలకు ఆదరణ ఎక్కువ ఉంటుందన్నది నిజం. అందుకే మేం జానపద గీతాలను ఎంచుకుంటాం. అవి సహజమైనవి కాబట్టి ఆనందాన్ని పంచుతాయి. నాకు కూడా జానపద గీతాలు చాలా ఇష్టం’ అని పాఠక్ వివరించింది. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో ఇటీవలే ముగియడం తెలిసిందే. ఆ సమయంలో పాఠక్ తీరిక లేకుండా గడిపింది. ముంబై ఘాట్కోపర్లోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఈమె పాడిన దాండియా గేయాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. మంగల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 1990లలో పాఠక్ గొంతు నుంచి వెలువడిన ‘యాద్ పియా కీ ఆనే లగీ’ ‘మైనే పాయల్ హై చన్కాయి’, ‘మేరీ చూనర్ ఉడ్ ఉడ్ జాయే’ వంటి ప్రేమగీతాలు యువతరాన్ని ఓలలాడించాయి. ‘మా బృందసభ్యులందరి సమష్టి కృషి వల్లే నేను విజయం సాధించాను. నా గొంతు టీనేజ్ యువతిలా ఉంటుందని మా సంగీత దర్శకుడు చెప్పేవాడు. అందుకే అన్ని పాటలనూ నాతోనే పాడించేవాడు’ అని పాఠక్ తెలిపింది. అంతేకాదు.. ఈమె మరోసారి జానపద గీతాల ఆల్బమ్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది వచ్చే ఏడాది విడుదలవుతుంది. అంతే పాఠక్ అభిమానులకు మరోసారి పండగ అన్నమాటే! -
జనం మెచ్చేది జానపదాలనే!: ఫాల్గుణి పాఠక్
న్యూఢిల్లీ:1990లలో పాప్ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫాల్గుణి పాఠక్ ప్రేమ, దాండియా గేయాలతో యువతరాన్ని మంత్రముగ్ధులను చేసిందని చెప్పుకోవచ్చు. మనదేశంలో జానపద గీతాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఈమె చెబుతోంది. ముంబైలోని నవరాత్రి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న ఈ 42 ఏళ్ల గాయని ‘ఇంద్ర మెరువ గయి’, ‘చమ్ చమ్ పాయలియా’ వంటి గేయాలతో వీనుల విందు చేసింది. ‘పాప్ గేయాలకంటే జానపద గీతాలకు ఆదరణ ఎక్కువ ఉంటుందన్నది నిజం. అందుకే మేం జానపద గీతాలను ఎంచుకుంటాం. అవి సహజమైనవి కాబట్టి ఆనందాన్ని పంచుతాయి. నాకు కూడా జానపద గీతాలు చాలా ఇష్టం’ అని పాఠక్ వివరించింది. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో ఇటీవలే ముగియడం తెలిసిందే. ఆ సమయంలో పాఠక్ తీరిక లేకుండా గడిపింది. ముంబై ఘాట్కోపర్లోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఈమె పాడిన దాండియా గేయాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.