
కొన్ని పాటలకు భాషతో సంబంధం ఉండదు. కాల పరిమితి ఉండదు. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా వాటిని మర్చిపోలేరు. ఒకవేళ మర్చిపోయినా.. మళ్లీ ఒక్కసారి వింటే చాలు.. మనసు గాల్లో తేలి ఆడుతుంది. అలాంటి పాటల్లో ఫాల్గుని పాథక్ ఆలపించిన 'చూడి జో కర్నె కే హాథోన్ మే’ సాంగ్ ఒకటి. 90లలో అమ్మాయిలను.. కుర్రకారును ఊపు ఊపేసిన పాట ఇది. నార్త్ నుంచి మొదలుపెడితే సౌత్, ఈస్ట్ అనే సంబంధం లేకుండా ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఏ ఫంక్షన్‌లో అయినా ఈ పాట ఉండాల్సిందే. పాఠశాల, కళాశాల వార్షికోత్సవం ఉందంటే చాలు.. ఈ పాటకు స్టెప్పులేయాల్సిందే.
దాదాపు రెండు దశాబ్దాల కింద విడుదలైన ఈ ప్రైవేట్ ఆల్పబ్.. ఇప్పటికీ చాలా స్పెషల్. ఈ పాట లిరిక్స్ గానీ, బ్లూ లెహంగాలో రియా సేన్ సిగ్నేచర్ స్టెప్పులు కానీ ఇప్పటికీ మర్చిపోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో పలు మార్లు ఈ పాటను ప్లే చేశారు. ఇప్పటికీ పలువురు ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిన్న వచ్చిన పాటను నేడు గుర్తుపెట్టుకోకవడమే కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో.. 20 ఏళ్ల నాటి పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చేయడం నిజంగా గొప్ప విషయమే.
A message to the future Generations, Don't let this song die..#90skid pic.twitter.com/iDTSNmZtn3
— 90skid (@memorable_90s) August 29, 2023