సౌత్ టు నార్త్.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్ రాజ్. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్‌లో కేరళ లిటరేటర్ ఫెస్టివల్‌కు ప్రకాశ్ రాజ్ హాజరయ్యాడు.
సహజత్వం లేదు
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్‌లా ఉంటుంది.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి.
ఫోకస్ అంతా దానిపైనే
దళితుల సమస్యలను తమిళ యంగ్ డైరెక్టర్స్ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక బాలీవుడ్ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్, రీల్స్, ప్రమోషన్స్.. వీటిపైనే ఫోకస్ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.
చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్ ఇచ్చిన నటి


