బుల్లితెర నటి మహి విజ్ ఇటీవలే వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలుకుతూ భర్త జే భానుషాలితో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆమె కొత్త కారు కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మినీ కూపర్ ఇంటికి తీసుకొచ్చామంటూ మహి వీడియో షేర్ చేసింది. దానిపై జే స్పందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు.
కూతురికి గిఫ్ట్
ఇకపోతే తారకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మినీ కూపర్ కావాలని అడిగింది. అప్పుడు అంత అవసరం, స్థోమత లేక కొనలేదు. కానీ ఇప్పుడు తన కోరిక నెరవేర్చే సమయం వచ్చిందంటోంది మహి. అందుకే తనకెంతో ఇష్టమైన కూపర్ కారును గిఫ్టుగా ఇచ్చానంటోంది. మహి.. తెలుగు సినిమా తపనలో హీరోయిన్‌గా నటించింది. సినిమాల్లో అదృష్టం కలిసిరాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయింది.
సీరియల్స్
జే భానుషాలి.. మూవీస్ చేయడంతోపాటు సీరియల్స్ చేశాడు. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. జే- మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ జంటగా నాచ్ బలియే డ్యాన్స్ షో 5వ సీజన్‌లో పాల్గొని ట్రోఫీ గెలిచారు. ఈ జంటకు కూతురు తార సంతానం. బాబు రాజ్‌వీర్, పాప ఖుషిల బాధ్యతను కూడా ఈ దంపతులే చూసుకుంటున్నారు. గతేడాది చివర్లో ఇద్దరూ విడిపోయారు.


