బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి సోనియా ఆకుల 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. యష్ వీరగోనిని ప్రేమించి పెళ్లాడింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కాగా సోనియా- యష్ దంపతులు పెళ్లయిన ఏడాదికే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2025 డిసెంబర్ 8న వీరి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది. తనకు శిఖ వీరగోని అని నామకరణం చేశారు.
నిద్రలేని రాత్రులు
తాజాగా కూతురి బారసాల ఫంక్షన్ ఫోటోలను సోనియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. '28 డిసెంబర్ 2025.. 21 రోజుల ఫంక్షన్ ఎంత అద్భుతంగా గడిచిందో.. నీ చిన్ని పాదాలు, నాకు నిద్రలేని రాత్రులు, వెల్లివిరిసిన ఆనందాలు.. మాటల్లో చెప్పలేంతన సంతోషాన్ని మా కుటుంబంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది. ఇల్లు నిండుగా కనిపిస్తోంది' అంటూ పాపను ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేసింది.
తొలిసారి ఊయలలో
సోనియా దంపతులిద్దరూ కలిసి పాపను తొలిసారి ఊయలలో వేశారు. అయితే చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. పాపను చూపించొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా మూడునెలలవరకు చూపించకూడదనే ఆగాం.. వచ్చే నెలలో చూపిస్తాను అని సోనియా బదులిచ్చింది. నార్మల్ డెలివరీయా? సీ సెక్షనా? అని మరో నెటిజన్ అడగ్గా సీ సెక్షన్ జరిగిందని పేర్కొంది. సోనియా.. జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్, ఆశ ఎన్‌కౌంటర్ సినిమాల్లో నటించింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొంది.
చదవండి: విడాకులు తీసుకున్న బుల్లితెర జంట


