బుల్లితెర నటి అనూష హెగ్డే భర్త, నటుడు ప్రతాప్ సింగ్‌తో చాలాకాలం దూరంగా ఉంటోంది. వీరిద్దరికీ విడాకులయ్యాయా? అన్న అనుమానాలకు ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది అనూష. నా వైవాహిక జీవితంలో 2023 తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో మీ అందరికీ తెలుసు. మేమిద్దరం చట్టపరంగా 2025లోనే విడిపోయాం అని తెలియజేయడానికే ఈ పోస్ట్..
అధ్యాయం ముగిసింది
దీనిపై ఎటువంటి చర్చ పెట్టొద్దని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు, అందిస్తున్న సపోర్ట్‌కు కృతజ్ఞతలు అని పేర్కొంది. పరస్పర అంగీకారంతోనే తన జీవితంలో ఈ అధ్యాయం ముగిసిందని తెలిపింది. ప్రస్తుతం తన కుటుంబం, కెరీర్, మానసిక ప్రశాంతతపైనే దృష్టిపెట్టినట్లు రాసుకొచ్చింది.
సీరియల్‌లో జంటగా..
అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే నెలలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు మొదలయ్యాయి. చివరకు దంపతులిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు.
సీరియల్, సినిమా
తెలుగు నటుడు ప్రతాప్ సింగ్.. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు ఇలా పలు సీరియల్స్ చేశాడు. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌లో నిహారికకు జోడీగా యాక్ట్ చేశాడు. బేవర్స్ సినిమాలోనూ నటించాడు. అనూష హెగ్డే విషయానికి వస్తే సూర్యకాంతం సీరియల్‌లో యాక్ట్ చేసిన ఈ నటికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ బుల్లితెరపై సెటిలైంది.
చదవండి: ఓటీటీలో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ.. సిరై రివ్యూ


