breaking news
Soniya Akula
-
తల్లయిన బిగ్‌బాస్ సోనియా.. పోస్ట్ వైరల్
ప్రస్తుత బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇకపోతే గత సీజన్లో పాల్గొని ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. బిగ్‌బాస్ షోలో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తల్లయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.గత సీజన్లో పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించింది. అయితే చివరివరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. బయటకొచ్చిన వెంటనే ఎంటర్ప్రెన్యూర్ యష్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గతేడాది ఇదే టైంకి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సోనియా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు ఈమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు శిఖా అని పేరు కూడా పెట్టినట్లు సోనియా భర్త యష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు సోనియాకు విషెస్ చెబుతున్నారు.అయితే యష్‌కి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. కాకపోతే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. టాలీవుడ్లో 'జార్జ్ రెడ్డి', 'కరోనా వైరస్', 'ఆశా ఎన్కౌంటర్' చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) -
జీన్స్ పాపలా శోభిత.. ప్రెగ్నెన్సీ లుక్‌లో బిగ్‌బాస్ సోనియా!
జీన్స్ పాపలా అక్కినేని శోభిత ధూళిపాళ్ల..బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ లుక్స్..పడచుపిల్లలా బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..కెన్యా టూర్లో అనసూయ చిల్..పెళ్లి వేడుకలో సందడి చేసిన హీరోయిన్ మహేశ్వరి.. View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో బిగ్‌బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.సంతోష్ కల్వచెర్ల, క్రిషికా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్'. సోనియా ఆకుల కీలకపాత్రలో నటించింది. రతన్ రిషి దర్శకుడు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం దీనితోపాటు పరదా, కూలీ, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా' సినిమా)'కిల్లర్ ఆర్టిస్ట్' విషయానికొస్తే.. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుతెలియని కొందరు వీరిపై దాడి చేస్తారు. స్వాతిని చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. జాను (క్రిషేక్ పటేల్) ఇతడి జీవితంలోకి వస్తుంది. మామూలు మనిషిగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు ఓ హీరోయిన్ మాస్క్ ధరించి 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు.ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే అయ్యుంటాడని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకుంటాడు. విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతడు ప్రత్యక్షమవుతాడు. అయితే తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? సిటీలోని హత్యలు చేస్తున్నది ఒకరా? లేదా ఇద్దరా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)


