
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో బిగ్‌బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
సంతోష్ కల్వచెర్ల, క్రిషికా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్'. సోనియా ఆకుల కీలకపాత్రలో నటించింది. రతన్ రిషి దర్శకుడు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం దీనితోపాటు పరదా, కూలీ, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా' సినిమా)
'కిల్లర్ ఆర్టిస్ట్' విషయానికొస్తే.. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుతెలియని కొందరు వీరిపై దాడి చేస్తారు. స్వాతిని చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. జాను (క్రిషేక్ పటేల్) ఇతడి జీవితంలోకి వస్తుంది. మామూలు మనిషిగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు ఓ హీరోయిన్ మాస్క్ ధరించి 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు.
ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే అయ్యుంటాడని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకుంటాడు. విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతడు ప్రత్యక్షమవుతాడు. అయితే తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? సిటీలోని హత్యలు చేస్తున్నది ఒకరా? లేదా ఇద్దరా? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)