
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసిన హారర్ మూవీ 'కిష్కింధపురి' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ఒకటి ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా అందుబాటులోకి వచ్చింది. కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తరచుగా తెలుగు సినిమాలు చేస్తూనే ఉంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. అలా ఈమె చేసిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ 'పరదా'. తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీని అనుపమ కూడా చెప్పింది. అలా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల నుంచి భిన్నమైన రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా యావరేజ్‌గా మిగిలింది.
(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ)
ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, మలయాళ వెర్షన్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది.
'పరదా' విషయానికొస్తే.. పడతి అనే ఊరిలో మహిళలంతా పరదాలేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషుడు వాళ్ల ముఖాలు చూడకూడదు. చూస్తే ఊరికి అరిష్టం దాపురించి, ఇక్కడ పిల్లలు పుట్టకుండా పురిటిలోనే చనిపోతారని ఈ ఊరి ప్రజల నమ్మకం. దానికి జ్వాలమ్మ అనే ఓ కథ ఉంటుంది. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (అనుపమ) అదే ఊళ్లోని రాజేష్(రాగ్ మయూర్)ని ఇష్టపడుతుంది. నిశ్చితార్ధం టైంకి ఓ షాకింగ్ సంఘటన జరుగుతుంది. దాంతో గొడవ జరిగి ఆ శుభకార్యం ఆగిపోతుంది. సుబ్బు ఆత్మాహుతి చేసుకోవాలని ఊరంతా నిర్ణయిస్తారు. అసలేమైంది? సుబ్బు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది మిగతా సినిమా.
(ఇదీ చదవండి: అమ్మవారికి రూ.4 కోట్ల కిరీటం సమర్పించిన ఇళయరాజా)
