మిరాయ్‌ ట్విటర్‌ రివ్యూ | Mirai Movie Twitter Review In Telugu | Sakshi
Sakshi News home page

Mirai X Review: మిరాయ్‌ పబ్లిక్‌ టాక్‌.. అదే పెద్ద సర్‌ప్రైజ్‌ అట!

Sep 12 2025 7:02 AM | Updated on Sep 12 2025 8:12 AM

Mirai Movie Twitter Review In Telugu

హను-మాన్‌ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్‌ ఇండియా మూవీ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్‌’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.

ఎక్స్‌లో మిరాయ్‌ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్‌ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్‌ కనిపించడం పెద్ద సర్‌ప్రైజింగ్‌ అంశం. ఎక్స్‌లో ప్రభాస్‌ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్‌ గెస్ట్‌ రోల్‌ సినిమాకు ప్లస్‌ అయిందని చెబుతున్నారు.

‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్‌ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్‌ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్‌ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు. 
 

 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్‌, జయరామ్‌, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌ బీజీఎం బాగుంది. మిరాయ్‌ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్‌. క్లైమాక్స్‌ బాగుంది. సినిమాలో నెగెటివ్‌ పాయింట్‌ ఏంటంటే.. టైమ్‌ అయిపోతుందని ఫాస్ట్‌ ఫాస్ట్‌గా ఎండ్‌ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement