breaking news
Paradha Movie
-
'అలా అడిగితే యాటిట్యూడ్ ఎక్కువంటారు': అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. డైరెక్టర్ ప్రవీణ్ సైతం రివ్యూలు బాగుంటేనే పరదా చూడాలని ఆడియన్స్‌కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా మూవీ సెట్లో షాట్ ఆలస్యం కావడంపై స్పందించింది.అనుమప మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు నోరు విప్పడానికి భయపడతారు. ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అంటారు. ఉదయం 7 గంటలకు షూట్‌కు వెళ్తే.. 9:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకు ఆలస్యమైందని అడిగితే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ముద్ర వేస్తారు. కో యాక్టర్ ఆలస్యంగా వచ్చినప్పుడు మమ్మల్ని ముందు ఎందుకు పిలవాలి. ముందుగానే సెట్‌కు పిలిచి రెండున్నర గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించాలి. ఈ గ్యాప్‌లో చాలా షాట్స్ తీయొచ్చు కదా అని అడిగితే.. నా డబ్బులు కదా మీకేంటి ఇబ్బంది అని అంటారు. అమ్మాయిలు ఏదైనా డైెరెక్ట్‌గా అడిగేస్తారు. అబ్బాయిలను మరో విధంగా ట్రీట్ చేస్తారు. అందరూ ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదు' అని అన్నారు.కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు. -
రివ్యూస్ చూశాకే మా సినిమా చూడండి: ఆడియన్స్‌కు డైరెక్టర్ ఛాలెంజ్
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం 'పరదా'. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా రివ్యూలు నచ్చితేనే పరదా మూవీ చూడాలని అన్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. 'నా రెండు సినిమాలు శుభం, సినిమా బండి ఒక జోనర్ చిత్రాలు. కానీ ఈ సినిమా నాకు పర్సనల్‌గా బిగ్ స్కేల్ ఫిల్మ్. వీడు చిన్న సినిమాలు చేస్తు బతికేస్తాడులే అందరు అనుకుంటారు. కానీ ముగ్గురు స్టార్స్‌తో పక్కా కమర్షియల్ సినిమా తీశా. ఈ చిత్రానికి మంచి పేరు తప్పకుండా వస్తుంది. కానీ పేరు ముఖ్యం కాదు.. డబ్బులు రావాలి. ఇలా జరిగితే ఇలాంటి కంటెంట్ సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అనుపమకు ఇదొక పెద్ద సోలో ఫిల్మ్. అనుష్కకు అరుంధతిలాగే అనుపమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది తనకు చాలా ఫేవరేట్ మూవీ. థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. రివ్యూలు బాగుంటేనే మా చిత్రాన్ని చూడండి. ఇది నా ఛాలెంజ్' అంటూ మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇంట్రెస్టింగ్గా అనుపమ 'పరదా' ట్రైలర్
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది చిత్రంపై అంచనాలు పెంచేలా ఉందని చెప్పొచ్చు. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ') ట్రైలర్లో కథ ఏంటనేది చూచాయిగా రివీల్ చేశారు. ఓ ఊరి దురాచారాలకు సంబంధించిన స్టోరీ ఇది. అక్కడ ఆడపిల్లలు మొహానికి పరదా కట్టుకుని బతుకుతుంటారు. అలాంటి చోట మరెలాంటి దురాచారాలా ఉన్నాయి? వాటిని తట్టుకుని సుబ్బు(అనుపమ) ఎలా నిలబడింది ఏం చేసిందనేదే కథలా అనిపిస్తుంది.ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ట్రైలర్‌తోనే ఓ బలమైన సందేశం ఇవ్వబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. మరి కూలీ, వార్ 2 రిలీజైన వారంలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
అనుపమ పరదా మూవీ.. బ్యూటీఫుల్ సాంగ్ వచ్చేసింది!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పరదా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాటను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎగరేయి నీ రెక్కలే అంటూ సాగే బ్యూటీఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు.ఈపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. రితేశ్ జీ రావు ఆలపించారు. ఈ సాంగ్‌ను గోపి సుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల థియేటర్లో సందడి చేయనుంది.Let the music take you deep within🎶3rd single from #Paradha is here!#YegareyiNeeRekkale #AkaleEeNeermutthukal Lyrical Video OUT NOWTelugu: https://t.co/7EUihYEyKQMalayalam: https://t.co/wQ31mwufieIn cinemas AUG 22@anupamahere @darshanarajend @sangithakrish @GopiSundarOffl pic.twitter.com/OA2EveLA4D— Paradha Movie (@Paradhamovie) August 5, 2025 -
పరదాలో థియేటర్‌కు అభిమానులు.. అందరి కళ్లు వారిపైనే!
పవన్ కల్యాణ్ హీరోగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఫిక్షనల్ చిత్రం హరిహర వీరమల్లు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వీపరీతమైన నెగెటివ్ టాక్ వస్తోంది. వీఎఫ్ఎక్స్తో పాటు కథలో ఎలాంటి కొత్తదనం లేదంటూ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తొలి ఆట నుంచే వీరమల్లు చిత్రానికి ఊహించని షాకిస్తున్నారు అభిమానులు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.అయితే ఇవాళ ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో కనిపించారు. సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమానులు తమ తలకు శారీని పరదాలాగా కప్పుకుని సందడి చేశారు. రెడ్ శారీలో వచ్చిన వీరు.. మొహాలు ఎవరికీ కనిపించకుండా థియేటర్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరంతా ఎందుకిలా వచ్చారని చర్చ మొదలైంది.అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన పరదా మూవీ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగానే ఇలా పరదా కప్పుకుని వచ్చారని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదంతా పరదా సినిమా ప్రమోషన్స్ కోసమేనని.. బ్రిలియంట్ ఐడియా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా మహిళ అభిమానులు ఒక్కసారిగా పరదాల్లో కనిపించడంతో అందరి చూపులు వారిపైనే పడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.#Paradha ladies watch #HariHaraVeeraMallu at Prasad’s! #Paradha movie directed by Praveen Kandregula (Cinema Bandi & Subham fame) is releasing on 22 August! pic.twitter.com/sO7AgByzMt— idlebrain jeevi (@idlebrainjeevi) July 24, 2025 -
ప్రసిద్ధ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్ పూజలు
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సినిమా సందర్భంగా హైదరాబాద్‌లో సందడి చేశారు. నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మను అనుపమ దర్శించుకున్నారు. తను నటించిన కొత్త సినిమా ఆగష్టు 22న విడుదల కానుంది. దీంతో అమ్మవారి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్ వెళ్లింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆపై ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సినిమా పరదా నుంచి 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' సాంగ్ పోస్టర్‌ను అక్కడ ప్రదర్శించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.Team #Paradha visited Balakampet Yallamma Temple for the launch of #YatraNaryasthu Song and sought divine blessings 🙏✨ SECOND SINGLE OUT TODAY at 12 PM 🎼 pic.twitter.com/jYOENdHR8P— Ananda Media (@AnandaMediaOffl) July 17, 2025 -
అమ్మాయి పోస్టర్ చూడగానే అందరూ పారిపోతారు: అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం పరదా. లేడీ ఓరియంటెడ్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన అనుపమ పరమేశ్వరన్ తన సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక అమ్మాయి లీడ్ రోల్‌గా సినిమా పోస్టర్ చూస్తే అందరూ కూడా వెనక్కి వెళ్లిపోతారని అనుపమ తెలిపింది. అది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీతో పాటు ఆడియన్స్ కూడా కావొచ్చని పేర్కొంది. అయితే అది తప్పని నేను చెప్పట్లేదు..అదే రియాలిటీ అని అనుపమ వెల్లడించింది. ఆ రియాలిటీ నుంచే వచ్చిన సినిమా పరదా అని.. మా సినిమా దాదాపు ఏడాది క్రితమే పూర్తయిందని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. మా సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా కష్టపడ్డామని.. చివరికీ ఆగస్టు 22న మీ ముందుకు వస్తున్నామని తెలిపింది. -
'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
'పరదా' తొలగిస్తూ మెప్పించేలా సాంగ్
'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' ఋగ్వేదంలోని స్త్రీని విశ్వశక్తిగా గుర్తించారు. అయితే, తర్వాతి కాలంలో స్త్రీ ఎలాంటి ఇబ్బందలు ఎదుర్కుందో చెప్పేందుకే 'పరదా' సినిమా వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
అందాల సిరి
‘మా అందాల సిరి మీద పడనీకు ఏ కళ్లు... ఆ చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు... వేయాలి పరదాలు... చేయాలి సరదాలు... అమ్మా... నీ దీవెనలు తోడుంటే అంతే చాలు... మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు’ అంటూ సాగుతుంది ‘పరదా’ సినిమాలోని ‘మా అందాల సిరి’ పాట. అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్‌లో నటించిన ‘పరదా’ సినిమాలోని పాట ఇది.‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆనంద మీడియా పతాకంపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా అందాల సిరి...’ పాట లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ, రమ్య బెహరా పాడారు. -
'పరదా' టీజర్ లాంచ్ ఈవెంట్..ఈవిడ ఎవరో తెలుసా .? (ఫొటోలు)
-
నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్
అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్. హైదరాబాద్‌లో జరిగిన ‘పరదా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ‘పరదా’, ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్’అన్నారు. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు . ‘‘ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్‌కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు సంగీత. ‘‘ఉమెన్ ఒరియంటెడ్ సినిమాలకు బిగ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రవీణ్. ‘‘ఈ సినిమా మలయాళం రైట్స్‌ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు’’ అన్నారు విజయ్ డొంకాడ. ‘‘ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ‘‘ఈ సినిమా తీయడం మాకు ‘బాహుబలి’లాంటి ప్రయత్నం’’ అని స్పష్టం చేశారు శ్రీధర్.