
పవన్ కల్యాణ్ హీరోగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఫిక్షనల్ చిత్రం హరిహర వీరమల్లు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వీపరీతమైన నెగెటివ్ టాక్ వస్తోంది. వీఎఫ్ఎక్స్తో పాటు కథలో ఎలాంటి కొత్తదనం లేదంటూ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తొలి ఆట నుంచే వీరమల్లు చిత్రానికి ఊహించని షాకిస్తున్నారు అభిమానులు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
అయితే ఇవాళ ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో కనిపించారు. సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమానులు తమ తలకు శారీని పరదాలాగా కప్పుకుని సందడి చేశారు. రెడ్ శారీలో వచ్చిన వీరు.. మొహాలు ఎవరికీ కనిపించకుండా థియేటర్కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో వీరంతా ఎందుకిలా వచ్చారని చర్చ మొదలైంది.
అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన పరదా మూవీ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగానే ఇలా పరదా కప్పుకుని వచ్చారని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదంతా పరదా సినిమా ప్రమోషన్స్ కోసమేనని.. బ్రిలియంట్ ఐడియా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా మహిళ అభిమానులు ఒక్కసారిగా పరదాల్లో కనిపించడంతో అందరి చూపులు వారిపైనే పడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా.. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.
#Paradha ladies watch #HariHaraVeeraMallu at Prasad’s! #Paradha movie directed by Praveen Kandregula (Cinema Bandi & Subham fame) is releasing on 22 August! pic.twitter.com/sO7AgByzMt
— idlebrain jeevi (@idlebrainjeevi) July 24, 2025