
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది చిత్రంపై అంచనాలు పెంచేలా ఉందని చెప్పొచ్చు. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.
(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')
ట్రైలర్‌లో కథ ఏంటనేది చూచాయిగా రివీల్ చేశారు. ఓ ఊరి దురాచారాలకు సంబంధించిన స్టోరీ ఇది. అక్కడ ఆడపిల్లలు మొహానికి పరదా కట్టుకుని బతుకుతుంటారు. అలాంటి చోట మరెలాంటి దురాచారాలా ఉన్నాయి? వాటిని తట్టుకుని సుబ్బు(అనుపమ) ఎలా నిలబడింది ఏం చేసిందనేదే కథలా అనిపిస్తుంది.
ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ట్రైలర్‌తోనే ఓ బలమైన సందేశం ఇవ్వబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. మరి కూలీ, వార్ 2 రిలీజైన వారంలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్‍పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)