'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా? | Peddi Movie Jagapathi Babu Look And Details | Sakshi
Sakshi News home page

Peddi Movie: గుర్తుపట్టలేనంతగా మార్చేశారు.. 'పెద్ది'లో స్టార్ నటుడు ఇలా

Dec 29 2025 3:23 PM | Updated on Dec 29 2025 4:19 PM

Peddi Movie Jagapathi Babu Look And Details

రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)

పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.

'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement