ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.
(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)
ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?)


