
రీసెంట్ టైంలో ఏ కొత్త సినిమా అయినా సరే వారం రోజులు నిలబడటమే గ్రేట్ అన్నట్లు తయారైంది. ఎందుకంటే స్టార్ హీరోల చిత్రాలు కూడా పట్టుమని పదిరోజులు ఆడట్లేదు. అలాంటిది ఓ యానిమేటెడ్ మూవీ.. రిలీజై రెండు వారాలు దాటిపోయినా సరే ఫుల్ జోరు చూపిస్తోంది. అవును ఇప్పటివరకు చెప్పింది 'మహావతార నరసింహ' గురించే. ఇప్పుడు ఈ చిత్రం మరో రికార్డ్ సృష్టించింది.
సలార్, కేజీఎఫ్ నిర్మించిన హొంబలే సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'మహావతార నరసింహ'. మనలో చాలామందికి తెలిసిన నరసింహా స్వామి కథతో ఈ చిత్రాన్ని పూర్తిగా వీఎఫ్ఎక్స్‌లో తీశారు. జూలై 25న పాన్ ఇండియా వైడ్ రిలీజైంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది గానీ తర్వాత మాత్రం రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది.
(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)
ఇప్పటివరకు 15 రోజులు కాగా ఏకంగా రూ.150 కోట్ల మేర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు బుక్ మై షోలో 3.6 మిలియన్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే కన్నడ నుంచి ఓ యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు హోంబలే సంస్థ ట్వీట్ కూడా చేసింది.
ఒరిజినల్‌గా కన్నడ భాష నుంచే దీన్ని తెరకెక్కించినప్పటికీ కన్నడ, తమిళ, మలయాళంలో పెద్దగా వసూళ్లు రాలేదు. తెలుగు, హిందీ నుంచి మాత్రం దాదాపు కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితోపాటు రిలీజైన 'హరిహర వీరమల్లు' ఇప్పటికీ సైలెంట్ అయిపోగా.. ఈ మూవీ వచ్చిన వారం తర్వాత రిలీజైన 'కింగ్డమ్' కూడా బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. 'కూలీ', 'వార్ 2' రిలీజైన తర్వాత ఈ మూవీ జోరు తగ్గుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)
Unleashing a divine blaze 🦁❤️🔥#MahavatarNarsimha races past 150 CRORES+ worldwide gross till Aug 8th, and continues setting screens on fire all over .
Catch the divine phenomenon, running successfully in theatres near you.#Mahavatar @hombalefilms @AshwinKleem… pic.twitter.com/RBbuu8OULS— Hombale Films (@hombalefilms) August 9, 2025