
తెలుగు హీరో మహేశ్ బాబు.. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు మహేశ్ భార్య నమ్రత కూడా క్యూట్ అండ్ లవ్లీ విషెస్ చెప్పింది. తనకు బలం, సర్వస్వం నువ్వే అని చెబుతూ ఫ్యామిలీ ఫొటోని పంచుకుంది. ఈ పోస్ట్‌కి మహేశ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
(ఇదీ చదవండి: తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేశ్ బాబుకు 'మెగా' శుభాకాంక్షలు)
దాదాపు 25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న మహేశ్ బాబు.. తన నటనతో పాటు వ్యక్తిగతంగానూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే థియేటర్లలో రీ రిలీజ్ అయిన 'అతడు' చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్లు విషెస్ చెప్పడం సంగతి చెప్పడం కంటే మహేశ్‌కి భార్య నమ్రత తన విషెస్ చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.
'నా జీవితాన్ని ఓ అందమైన కలలా మార్చిన మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా లవ్, నా బలం, నా సర్వస్వం. ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటా మహేశ్' అని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరోవైపు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి మూవీ నుంచి చిన్న అప్‌డేట్ కూడా వచ్చింది. నవంబర్‌లోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్ ఇస్తామని, అప్పటివరకు వెయిటింగ్ తప్పదు అని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. సాయం కోసం ఇలా సంప్రదించండి)