తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేశ్‌ బాబుకు 'మెగా' శుభాకాంక్షలు | Chiranjeevi And Geetha Arts Special Birthday Wishes To Mahesh Babu, Check Tweets Inside| Sakshi
Sakshi News home page

Mahesh Babu Birthday: తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేశ్‌ బాబుకు 'మెగా' శుభాకాంక్షలు

Aug 9 2025 9:16 AM | Updated on Aug 9 2025 10:53 AM

Chiranjeevi Birthday Wishes To Mahesh Babu

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది. ప్రతి ఒక్కరి జీవితంలో 50 ఏళ్ల వేడుక చాలా ప్రత్యేకమైనది. దీంతో ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలు ఆయనకు విషెస్‌ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పలు సినీ నిర్మాణ సంస్థలు కూడా మహేశ్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నాయి. మరోవైపు ‘అతడు’ రీ రిలీజ్‌ సందర్భంగా థియేటర్లలో వద్ద అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది.

'నా ప్రియమైన మహేశ్‌ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెలుగు సినిమాకు గర్వకారణం. అతీంద్రియాలను జయించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మీరు చిన్నవారవుతున్నట్లు కనిపిస్తోంది. మీకు అద్భుతమైన సంవత్సరం కానుంది. ఎన్నో సంతోషాలను తీసుకొస్తుంది.'.. - చిరంజీవి

ప్రియమైన మహేశ్‌ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు నీకు 50 ఏళ్లు నిండుతాయి. కానీ, నువ్వు ఎప్పటికీ నా చిన్నోడివే . నీ జోక్స్‌, ప్రేమ ఎప్పటికీ చాలా మంది హృదయాలకు చేరువ అవుతుంది.  నిజంగా నీలాంటి వారు ఎవరూ లేరు. ఎప్పటికీ నవ్వుతూ ఉండు. #SSMB29లో ప్రపంచం నీ మాయాజాలాన్ని చూసే వరకు నేను వేచి ఉండలేను!.. - వెంకటేశ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement