
‘మా అందాల సిరి మీద పడనీకు ఏ కళ్లు... ఆ చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు... వేయాలి పరదాలు... చేయాలి సరదాలు... అమ్మా... నీ దీవెనలు తోడుంటే అంతే చాలు... మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు’ అంటూ సాగుతుంది ‘పరదా’ సినిమాలోని ‘మా అందాల సిరి’ పాట. అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్‌లో నటించిన ‘పరదా’ సినిమాలోని పాట ఇది.
‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆనంద మీడియా పతాకంపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా అందాల సిరి...’ పాట లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ, రమ్య బెహరా పాడారు.