
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం పరదా. లేడీ ఓరియంటెడ్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన అనుపమ పరమేశ్వరన్ తన సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఒక అమ్మాయి లీడ్ రోల్గా సినిమా పోస్టర్ చూస్తే అందరూ కూడా వెనక్కి వెళ్లిపోతారని అనుపమ తెలిపింది. అది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీతో పాటు ఆడియన్స్ కూడా కావొచ్చని పేర్కొంది. అయితే అది తప్పని నేను చెప్పట్లేదు..అదే రియాలిటీ అని అనుపమ వెల్లడించింది. ఆ రియాలిటీ నుంచే వచ్చిన సినిమా పరదా అని.. మా సినిమా దాదాపు ఏడాది క్రితమే పూర్తయిందని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. మా సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా కష్టపడ్డామని.. చివరికీ ఆగస్టు 22న మీ ముందుకు వస్తున్నామని తెలిపింది.