
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్‌లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా నిర్వహించిన పరదా ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా ఇదేనని అన్నారు.
అనుమప పరమేశ్వరన్ మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమా ఈవెంట్‌లో ఫస్ట్ ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. నా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా పరదానే. ఆగస్టు 22న మీరు కూడా ఇదే మాట చెబుతారని నాకు నమ్మకముంది. అందరూ చెప్పినట్లు మీరు సినిమా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పండి. రివ్యూస్ చూసే పరదా మూవీకి వెళ్లండి' అని మాట్లాడారు.
కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్‌లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.