
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమక్ష ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే, ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించిన ఒక వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అంటూ సాగే ఈ పాట ఆందరినీ ఆలోచింపజేస్తుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు.